Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓలాకు స్టోర్‌డాట్ టెక్నాలజీ
న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌కి చెందిన స్టోర్‌డాట్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించింది. దీన్ని ఓలా సంస్థ తమ విద్యుత్ స్కూటర్లకు ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది. దీంతో పెట్రోల్ వాహనాల్లో ఇంధనం నింపుకునేంత సులభంగా విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కూడా అయిపోనుంది. ఇవి బ్యాటరీలు, ఛార్జింగ్ టెక్నాలజీలో అద్భుతమైన ప్రగతి సాధించిన స్టోర్‌డాట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంటున్నట్లు భవీష్ అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే భారత్‌లో ఇవిలకు సంబంధించి సరికొత్త శకం చూడబోతున్నారన్నారు.