Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాల్ చేయడం, లేదా మెసేజ్ పంపించడం, లేదా అవాంఛిత కమ్యూనికేషన్ బ్లాక్ చేసే విషయంలో యూజర్ల అనుభూతిని మరింత మెరుగుపరచడానికి ట్రూకాలర్ కృషి చేస్తూనే ఉంటుంది. మెసేజింగ్/చాట్ ఫీచర్‌ను మనం ఉపయోగించే విధానంలో మార్పు తీసుకురావడానికి, మెసేజింగ్ గేమ్ స్థాయి పెంచడానికి ట్రూకాలర్ తన యాప్‌లో సరికొత్త అప్‌డేట్స్ అందించింది. కొత్త ఫీచర్లలో అర్జంట్ మెసెజస్, స్మార్ట్ కార్డ్స్ షేర్ చేసుకోవడం, సరికొత్త తరహాలో స్మార్ట్ ఎస్‌ఎంఎస్, సెంట్ చాట్ మెసెజ్స్ ఎడిట్ చేయడం, డీఫాల్ట్ వ్యూ సెట్ చేసుకోవడం వంటివి ఉన్నాయి. ఈ మేరకు వారు ఒక ప్రకటనలో తెలిపారు
సంభాషణల విషయంలో జాగ్రత, తోటివారితో సులభంగా కలిసిపోవడం, ఇంటర్నెట్ అనే వర్చువల్ ప్రపంచాన్ని అధికంగా ఉపయోగించుకునే విషయంలో యూజర్లు వారికి వారు బాధ్యులై ఉండేలా చూడటం ట్రూకాలర్ లక్ష్యం. యాప్‌లోని కొత్త ఫీచర్‌లు నేటి తరానికి అదనపు ఉత్తేజాన్ని అందిస్తాయి. అవి కేవలం ఫంక్షనల్ టూల్స్ మాత్రమే కాకుండా వేగవంతమైన ప్రపంచంలో సమయాన్ని ఆదా కూడా చేస్తాయి.
కొత్త చేర్పులపై ట్రూకాలర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రిషిత్ ఝుంఝున్‌వాలా మాట్లాడుతూ, 'పెరుగుతున్న మా యూజర్ల అవసరాలపై మేము నిరంతరం దృష్టి పెడుతూ వాటికి తగిన పరిష్కారాలు అందించడం కొనసాగిస్తూ ఉంటాం. కొత్తగా రూపొందించిన ఫీచర్లు ప్రతీ ఒక్కరి సంభాషణలు సురక్షితంగా, సమర్థవంతంగా ఉండాలన్న మా లక్ష్యానికి మరింత చేరువ చేస్తాయి. ఒక శక్తిమంతమైన సంభాషణ కేంద్రంగా ట్రూకాలర్ ఆవిర్భావించింది. ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని చూసేవారికి ఈ కొత్త ఫీచర్లు మరింత విలువ అందిస్తాయి. ఈ ఫీచర్లు సరదాగా ఉండటమే కాదు ఉపయోగించడం కూడా చాలా సులువు. రోజువారీ మెసేజింగ్‌లో మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలను ఇవి పరిష్కరించగలవు` అని అన్నారు.
కొత్త ఫీచర్ల సమగ్ర గైడ్:
అర్జంట్ మెసెజస్ - కొన్నిసార్లు మీరు కాల్ చేయకుండానే మీరు పంపించే మెసేజ్‌ను అందుకున్నవారు చూడాలని భావిస్తారు. ఈ కొత్త ఫీచర్ అనుకూల నోటిఫికేషన్‌తో క్లిష్టమైన లేదా కీలకమైన లేదా సమయానికి సంబంధించిన సందేశాలను అందుకునే వారి దృష్టిని ఆకర్షించేలా చేస్తుంది. మరొక యాప్ ఒపెన్ చేసినప్పటికీ మీరు పంపించిన మెసేజ్‌ను అందుకున్న వారు చూసేంత వరకు అది స్క్రీన్‌పై కనిపిస్తూనే ఉంటుంది.
డిఫాల్ట్ లాంచ్ స్క్రీన్‌ని సెట్ చేసుకోవడం - ట్రూకాలర్ వినియోగదారులు ఇప్పుడు యాప్‌ను ఫస్ట్ టైమ్ లాంచ్ చేసినప్పుడు దాన్ని డీఫాల్ట్‌గా కనిపించేలా పెట్టుకోవచ్చు. కాల్స్ లేదా మెసేజ్‌ల ట్యాబ్‌పై కొద్దిసేపు ప్రెస్ చేయడం ద్వారా డీఫాల్ట్ వ్యూగా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. రెండోసారి యాప్ ఒపెన్ చేసినప్పుడు అది డిఫాల్ట్‌గా ఒపెన్ అవుతుంది.
పంపిన చాట్ మెసెజస్ ఎడిట్ చేయడం - మెసెజ్ టైప్ చేసేటప్పుడు మనం హడావుడిలో కొన్నిసార్లు తప్పులు చేస్తాం. మీరు అలాంటి పొరపాట్లు చేస్తున్నట్టు అయితే ఈ ఎడిట్ ఫీచర్ మీకు బాగా మేలు చేస్తుంది. మీరు పంపిన మెసేజ్‌ను అందుకున్న వారు చూసిన తర్వాత కూడా మీరు దాన్ని ఎడిట్/మార్పులు చేసే వెసులబాటు కొత్త ఫీచర్ కల్పిస్తుంది. మీరు ఎడిట్ చేసినట్టు అయితే Chat (edited) అనే పదాలు కనిపిస్తాయి. మీరు మెసెజ్ పంపిన తర్వాత ఎప్పుడైనా చాట్ మెసేజ్ మీరు ఎడిట్ చేయవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఈ ఎడిటింగ్ ఆప్షన్ ట్రూకాలర్ చాట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది ఎస్‌ఎంఎస్‌లో కాదు.
గొప్ప కొత్త స్మార్ట్ ఎస్‌ఎంఎస్ అనుభవం - వేలాది టెక్ట్స్ మెసెజస్‌ను ఆర్గనైజ్డ్‌గా ఉంచుతుంది స్మార్ట్ ఎస్‌ఎంఎస్. ట్రూకాల్ స్మార్ట్ ఎస్‌ఎంఎస్ ఇప్పుడు కొత్తదనాన్ని సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు అందించిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా ఎస్‌ఎంఎస్‌లు వన్-వే ఇన్‌కమింగ్ సందేశాలు కాబట్టి, మేము అలాంటి ముఖ్యమైన సందేశాలను కాలక్రమానుసారంగా చూపుతూ వాటిని హైలైట్స్ అని పిలుస్తున్నాము, తద్వారా వినియోగదారులు ప్రతి కొత్త ఎస్‌ఎంఎస్ చదవడానికి వివిధ ఎస్‌ఎంఎస్ థ్రెడ్‌లలోకి వెళ్లవలసిన అవసరం లేదు. అదనంగా, ట్రాన్సక్షన్స్, డెలివరీలు, ప్రయాణం, బిల్లుల వంటి స్మార్ట్ ఫిల్టర్‌ల ఆధారంగా ముఖ్యమైన మెసెజస్ చూడటం చాలా సులభతరంగా ఉంటుంది. మీరు ఎక్కువ మెసెజస్ పంపించే వారిని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు.
స్మార్ట్ కార్డ్ భాగస్వామ్యం - ఎంతో క్లిష్టమైన సమాచారాన్ని సులభంగా చదవగలిగేలా అందిస్తాయి స్మార్ట్ కార్డ్‌లు. ఇప్పుడు మీరు స్మార్ట్ కార్డ్‌లను ఇమేజ్ రూపంలోనూ షేర్ చేయవచ్చు. వారు ట్రూకాలర్‌ని ఉపయోగించినా. ఉపయోగించకపోయినా ఆ సమాచారాన్ని సులభంగా చదవగలరు. మీరు ఎవరితోనైనా షేర్ చేయాలనుకుంటున్న ట్రాన్సక్షన్, టిక్కెట్, ఓటీపీ లేదా బిల్లు వంటి ముఖ్యమైన ఎస్‌ఎంఎస్‌లను మీరు ఇప్పుడు టెక్స్ట్ రూపంలో కాకుండా ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా స్మార్ట్ కార్డ్ చిత్రంగా షేర్ చేయవచ్చు. ఈ మెసేజ్ అందుకునేవారు ఆ ముఖ్యమైన సందేశాన్ని ఒక్క చూపులోనే చూడగలుగుతారు.
ముఖ్య గమనిక: అధునాతన మెషీన్ లెర్నింగ్ మోడల్ కారణంగా మొత్తం మెసేజ్ ప్రాసెసింగ్ అంతా యూజర్‌కు చెందిన డివైస్‌లోనే చోటుచేసుకునేలా కొత్త ఫీచర్ల రూపకల్పన జరిగింది. ట్రూకాలర్ ఎలాంటి SMS కంటెంట్ చదవదు. అదనంగా, ఈ ప్రాసెసింగ్‌లో భాగంగా వినియోగదారు పరికరం నుండి ఎటువంటి సందేశం వెళ్లదు.