Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లగ్జరీ బాత్‌వేర్ సొల్యూషన్ బ్రాండ్‌లలో ఒక్కటైన ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెట్ (ఏజీఎల్) రూ.441 కోట్ల కోసం రైట్ ఇష్యూకు వచ్చింది. షేర్ హౌల్డర్ల కోసం సోమవారం తెరుచుకున్న ఈ ఇష్యూ మే 10తో ముగుస్తుందని ఆ కంపెనీ తెలిపింది. ఈ రైట్ ఇష్యూలో ప్రతీ ఈక్విటీ షేర్ రూ.63 చొప్పున లభిస్తుందని.. ఏప్రిల్ 22 నాటి ముగింపు షేర్ ధరతో పోల్చితే 24 శాతం రాయితీ లభిస్తుందని పేర్కొంది. ఈ ఇష్యూ ద్వారా రూ.440.96 కోట్ల సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.