Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. రూ.2 కోట్లు పైబడిన డిపాజిట్లపై 40 నుంచి 90 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ పెంపు ఉంటుందని వెల్లడించింది. కొత్త రేట్లు మే 10 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 3-10 ఏండ్ల కాలపరితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటును 3.60 శాతం నుంచి 4.50 శాతానికి చేర్చినట్లు వెల్లడించింది. 7 నుంచి 45 రోజుల వ్యవధి మినహాయించి మిగిలిన టెన్యూర్‌పై వడ్డీరేట్లను పెంచింది. 46 రోజుల నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 3శాతం ఉన్న వడ్డీ రేటు 3.50 శాతానికి, 180 నుంచి 210 కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 3.10 శాతం నుంచి 3.50 శాతానికి చేర్చినట్లు వెల్లడించింది. మూడు నుంచి 5 సంవత్సరాల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 4.50 శాతం వరకు, 5ఏళ్ల నుంచి 10 కాలానికి గాను 4.50శాతం వరకు పెంచినట్లు పేర్కొంది. సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై అదనపు వడ్డీ అందిస్తున్నట్లు వెల్లడించింది.