Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభ ధర రూ.2.99 లక్షలు
హైదరాబాద్ : హంగేరీకి చెందిన ప్రీమియం ద్విచక్ర వాహన కంపెనీ కీవే భారత మార్కెట్లోకి తన నూతన శ్రేణీ సిక్ట్సీస్ 300ఐ, వియోస్టా 300లను విడుదల చేసింది. హైదరాబాద్‌లో వీటిని ఆవిష్కరించారు. ఎక్స్‌షోరూం వద్ద వీటి ప్రారంభ ధరలను రూ.2,99,000గా నిర్ణయించింది. 2022 జూన్ నుంచి వీటి డెలివరీని ప్రారంభిస్తామని కీవే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జబక్ తెలిపారు. ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా బెనెల్లీ యొక్క 40కి పైగా డీలర్ నెట్ వర్క్‌ను కలిగి ఉన్నామన్నారు. అదే విధంగా అసెంబ్లీ ప్లాంట్ తోడ్పాటును తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మరో ఆరు మోడళ్లను ఆవిష్కరించనున్నామన్నారు.