Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిచ్ రేటింగ్స్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద గ్యాస్ సరఫరాదారు గెయిల్ ఇండియా ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. సంస్థకు 'బీబీబీ' రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్టు సోమవారం ఆ సంస్థ తెలిపింది. ''సంస్థ భవిష్యత్తు కూడా స్థిరంగా ఉండనుంది. గ్యాస్ సరఫరాలో గెయిల్ ఆదిపత్యం కొనసాగనుంది. రుణ పరపతి ప్రొఫైల్ 'బీబీబీ'గా ఉంది. ఇతర వ్యాపార విభాగాల్లోనూ మెరుగైన ప్రగతిని కనబర్చుతుంది'' అని ఫిచ్ తెలిపింది. భారత్‌లో గెయిల్ దాదాపుగా 14,502 కిలోమీటర్ల గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రతీ రోజు 206 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 21 రాష్ట్రాలకు సహజ వాయువు పైపులైన్‌తో విస్తరించి ఉంది. సహజ వాయువుతో పాటు పెట్రో కెమికల్స్, ఎల్‌పీజీ, ఇతర లిక్విడ్ హైడ్రోకర్బన్ విభాగాల్లోనూ సంస్థ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. అధిక ముడి చమురు ధరలు, స్పాట్ ఎల్‌ఎన్‌జీ ధరలు పెరుగుతుండటంతో గెయిల్ గ్యాస్ మార్కెటింగ్‌లో మరింత లాభపడొచ్చని అంచనా. సోమవారం బీఎస్‌ఈలో గెయిల్ ఇండియా షేర్ విలువ 1.66 శాతం పెరిగి రూ.134.65 వద్ద ముగిసింది.