Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే నెల నుంచి చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచ నా వేస్తున్నారు. కాగా.. గత రెండే ళ్లుగా చిన్న మొత్తాల పొదుపు ఖాతా లు, పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్యా సమృద్థి తదితర ఖాతాలపై కేంద్రం వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తోంది. ప్రతీ త్రైమాసికానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. కాగా.. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెండుసార్లు రెపో రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే త్రైమాసికానికి గాను చిన్న మొత్తాల డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెరగనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం, ఎన్‌ఎస్‌సీపై 6.8 శాతం, సుకన్యా సమృద్థిపై 7.6 శాతం చొప్పున వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి. కిసాన్ వికాస్ పత్రపై 6.9 శాతం వడ్డీ ఇస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక శాఖ పొదుపు పథకాలపై 40-110 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీరేట్లకు కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగియనున్న త్రైమాసికానికి గాను చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నయ్యర్ పేర్కొన్నారు.