Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నూతన ఛైర్మన్‌గా నితిన్ గుప్తా నియమితులయ్యారు. ఆయన్ను ఈ హోదాలో నియమిస్తూ జూన్ 25న కేంద్ర యూనియన్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్) 1986 ఆదాయపు పన్ను శాఖ బ్యాచ్‌కు చెందిన గుప్తా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఆయన పదవీ విరమణ పొందనున్నారు. ప్రస్తుతం గుప్తా సీబీడీటీ విభాగంలో ఇన్వెస్టిగేషన్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సీబీడీటీ ఛైర్మన్‌గా ఉన్న జెబి మోహన్ పాత్ర గత ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఐఆర్‌ఎస్ అధికారిణి సంగీతా సింగ్‌కు తాత్కాలిక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తాజాగా గుప్తాకు పూర్తి బాధ్యతలు అప్పగించారు.