Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బజాజ్ ఆటోలో ఆ కంపెనీ భారీగా షేర్ల బైబ్యాంక్‌ను చేపట్టనుంది. ఇందుకోసం దాదాపు గా రూ.2,500 కోట్ల విలువ చేసే షేర్లను ఓపెన్ మార్కెట్ నుంచి కొ నుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని బజాజ్ ఆటో సోమవారం రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూపులు మినహా ప్రస్తుత వాటాదారుల నుంచి రూ. 10 ముఖ విలువ కలిగిన కంపెనీ యొక్క పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లను ఓపెన్ మార్కెట్ నుండి బైబ్యాక్ చేసే ప్రతిపాదనను ఆమోదిం చింది. షేర్ల బైబ్యాంక్‌లో భాగంగా ఒక్కో షేర్‌కు రూ.4600 మించ కుండా చెల్లించాలని ఆ కంపెనీ నిర్ణయించింది. సోమవారం బిఎస్‌ఇలో బజాజ్ ఆటో షేర్ 1.29 శాతం పెరిగి రూ.3,862 వద్ద ముగిసింది.