Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛైర్మన్‌గా ఆకాష్ నియామకం
ముంబయి : రిలయన్స్ ఇండిస్టీస్‌లో భాగమైన రిలయన్స్ జియోలో డైరెక్టర్‌గా ఉన్న ముకేష్ అంబానీ తన పదవికి రాజీనామా చేశారు. కాగా ఈ సంస్థ ఛైర్మన్‌గా తన తనయుడు ఆకాష్ అంబానీ నియామకానికి జియో డైరెక్టర్ల బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది. రమీందర్ సింగ్ గుజ్రాల్, కెవి చౌదరిలను సంస్థ అదనపు డైరెక్టర్లు నియమిస్తూ తీర్మానం చేసింది. వీరు ముగ్గురూ 2022 జూన్ 27 నుంచి ఐదేళ్ల పాటు కొనసాగుతారు. ఆకాష్‌కు బాధ్యతలను ఇవ్వడం ద్వారా రిలయన్స్ వ్యాపారాన్ని తన పుత్రులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైందని తెలుస్తోంది. మరోవైపు జియో మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు స్వీకరించారని ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయి అంబానీ మరణం తర్వాత సోదరుడు అనిల్ అంబానీతో మాదిరిగా వాటాల పంపిణీకి తన కొడుకులు, కూతుళ్ల మధ్య వివాదం తలెత్త వద్దని ముకేష్ అంబానీ భావించి.. తాజా నిర్ణయం తీసుకుని ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.