Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు కనిష్టానికి క్షీణత
- డాలర్‌తో 79 చేరువలో నమోదు
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ తీవ్ర అగాథంలోకి పడిపోతోంది. దేశ చరిత్రలో ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 79 చేరువలో నమోదయ్యింది. మంగళవారం డాలర్‌తో రూపాయి విలువ మరో 48 పైసలు కోల్పోయి 78.85కు దిగజారింది. ఇది రికార్డ్ కనిష్టం. ఉదయం 78.53 వద్ద ప్రారంభమై.. రోజంతా ఒత్తిడికి గురైంది. ఆరు సెషన్లలో 100 పైసలు విలువ కోల్పోయింది. భారత్‌లోనూ మందగమన భయాలు, అధిక చమురు ధరలు, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు, ఎఫ్‌ఐఐలు వరుసగా తరలిపోవడం, ఆర్బీఐ వద్ద మారకం నిల్వలు తగ్గిపోవడం తదితర అంశాలు రూపాయిని కుదేలు చేస్తున్నాయి.