Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హాలీడే ప్యాకేజీ విభాగంలో మేక్ మై ట్రిప్ వృద్ధికి పూర్తిగా మహిళలతో కూడిన హాలీడే ఎక్స్‌పర్ట్స్ బృందం కారణం. ఆర్ధిక సంవత్సరం 2022లో ఈ మహిళా ఫ్రీలాన్సర్ల బృందం, హాలీడే ఎక్స్‌పర్ట్స్‌గా సేవలనందించడంతో పాటుగా దాదాపు రెండు లక్షల మంది యాత్రికులకు ప్రత్యేకంగా ప్యాకేజీలను తీర్చిదిద్దడంలో సహాయపడ్డారు. అంతేకాదు 10 సంవత్సరాలలో అత్యధికంగా ఈ నిపుణులు ప్యాకేజీలను విక్రయించిన సంవత్సరంగా ఈ ఆర్ధిక సంవత్సరం ముగించారు. స్థిరంగా వృద్ధి కొనసాగుతుండటంతో, రాబోయే నెలల్లో కూడా ఇదే వృద్ధిని ఆశిస్తోన్న మేక్ మై ట్రిప్, ఇప్పుడు తమ ఫ్రాంచైజీ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటుగా దేశవ్యాప్తంగా హాలీడే నిపుణుల సంఖ్య వృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకుంది.
ఈ సందర్భంగా మేక్ మై ట్రిప్ బిజినెస్ హెడ్, హాలీడేస్– ఎక్స్‌పీరియెన్సస్ జస్మీత్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఇంటి నుంచి పనిచేయడంలోని శక్తిని గుర్తించిన తొలి తరం కంపెనీలలో మేక్ మై ట్రిప్ ఒకటి. ఈ కారణం చేతనే మేము ఫ్రీలాన్సర్స్ బృందం పై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాము. సమగ్రమైన హాలీడే ప్లానింగ్ నిపుణుల తో కూడిన శక్తివంతమైన బృందాలను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాము. వీరు హాలీడే ప్యాకేజీల విభాగానికి స్థిరంగా తోడ్పాటునందిస్తున్నారు. మేమిప్పుడు మా 850కు పైగా హాలీడే ఎక్స్‌పర్ట్స్‌ను విస్తరించాలనుకుంటున్నాము.అలాగే మా ఫ్రాంచైజీ నెట్‌వర్క్స్‌ను ను సైతం విస్తరించబోతున్నాము. ఈ విభాగంలో మరింత లోతుగా చొచ్చుకుపోవడం లక్ష్యంగా చేసుకున్నాము’’ అని అన్నారు.
ఈ టీమ్‌ల నుంచి సమాంతరంగా లీడ్స్‌ను సైతం మేక్ మై ట్రిప్ నిర్మిస్తుంది. తద్వారా అత్యున్నత సామర్ధ్యం, డెలివరీ ప్రమాణాలకు సైతం భరోసా అందిస్తుంది. వీటితో పాటుగా ఈ ప్రొఫెషనల్స్‌కు ఆరోగ్యవంతంగా పనిచేసే వాతావరణం కూడా అందిస్తుంది. ‘‘ మా విస్తృతస్థాయి హాలీడే ఎక్స్‌పర్ట్ ప్రోగ్రామ్ మాకు గర్వకారణంగా ఉంది. దీనిలో అన్ని వర్గాల మహిళలూ భాగంగా ఉన్నారు. ఈ ప్లాట్‌ఫామ్ సౌకర్యవంతమైన పని వాతావరణం, ఆకర్షణీయమైన సంభాషణల ఆధారిత రెమ్యూనరేషన్, సమగ్రమైన వృద్ధికి పలు అవకాశాలను సైతం అందిస్తుంది’’ అని జస్మీత్ అన్నారు.
‘‘ఈ కంపెనీ పలు ప్రయోజనాలు సైతం అందిస్తుంది. వీటిలో స్వీయ, ఫ్యామిలీ భీమా కవరేజీ, నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం, అభివృద్ధి కోర్సులు, బృందాల నడుమ బంధం, అనుసంధానిత అవకాశాలు, ట్రావెల్ పెర్క్స్ మొదలైనవి ఉన్నాయి. మహమ్మారి సమయంలో ఓ బ్రాండ్‌గా మా పట్ల వారు అమిత విశ్వాసం చూపారు. ఈ టీమ్ యోగక్షేమాలను చూసుకుంటామనే మా వాగ్ధానానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ సమయంలో, మేము టీమ్ పై మరింతగాపెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే వారి నైపుణ్యంపై ఆధారపడి ట్రావెల్ ప్యాకేజీలకు ఆవల మహమ్మారి లక్ష్యిత, కారణ సంబంధిత ఎస్సెట్స్ నిర్మించడానికి కృషి చేస్తున్నాము’’ అని జస్మీత్ అన్నారు. ప్రస్తుతం, 850మంది హాలీడే ఎక్స్‌పర్ట్స్‌లో 43% మంది తల్లులు మరియు కేర్ గివర్స్. వీరు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు,కోల్‌కతా, హైదరాబాద్, ఇండోర్, అహ్మదాబాద్, ఛండీఘడ్, లక్నో నుంచి ఉన్నారు. మహమ్మారి సమయంలో మేక్ మై ట్రిప్ కు 200% ఆసక్తి మహిళా ఫ్రీలాన్సర్ల నుంచి వచ్చింది. వీరంతా ఈ మార్కెట్‌ల నుంచి టీమ్‌లలో చేరారు. ఈ టీమ్‌లో హాలీడే బుకింగ్ సందేహాలను విభిన్న భాషలలో తీర్చగలిగిన నైపుణ్యం కలిగి ఉన్నారు. ఈ టీమ్‌లో 84% మంది హిందీ మాట్లాడితే, మరాఠీ (14%), గుజరాతీ (12%), పంజాబీ (12%), బెంగాలీ (11%), కన్నడ (9%)మరియు తెలుగు (9%) ఉన్నారు. ఇవి గాక ఆంగ్లంలో కూడా ప్రావీణ్యత వీరికి ఉంది.