Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులే
- ఆర్‌బీఐ గవర్నర్ దాస్ వెల్లడి
న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమేనని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పునరుద్ఘాటించారు. విలువ ఆధారితంగానే ఎదైనా ఉండాలి తప్పా.. స్పెక్యులేషన్ (అసహజ విలువ) ఉండరాదన్నారు. దేశంలో క్రిప్టోకరెన్సీలను అనుమతించా లా..? లేదా..? అనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం స్టేక్ హోల్డర్ల, సంస్థలు, పలు వర్గాల నుంచి సంప్రదింపులను చేపడుతుంది. ఈ తరుణంలో ఆర్‌బీఐ గవర్నర్ వ్యాఖ్యలు కీలకమ య్యాయి. క్రిప్టో కరెన్సీలపై ఇది వరకు కూడా కేంద్ర బ్యాంక్ పలుసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ గురువారం ఫైనాన్సీయల్ స్టేబిలిటీ రిపోర్ట్ (ఎఫ్‌ఎస్‌ఆర్)ను విడుదల చేసింది. విత్త రంగంలో డిజిటలైజేషన్ వేగంగా పెరుగుతుందని దాస్ పేర్కొన్నారు. ఇదే సమయంలో సైబర్ రిస్కులు పెరుగుతున్నాయని.. దీనిపై ప్రత్యేక భద్రత అవసరమన్నారు. సూక్ష్మ ఆర్థిక గణంకాలు, ఆర్థిక స్థిరత్వం, సమగ్రాభివృద్థి కోసం తమ పాలసీ చర్యలు కొనసాగుతాయన్నారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను నిషేధించాలంటూ ఇది వరకు ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝున్ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. బిట్‌కాయిన్ ట్రేడింగ్ జూదం తీవ్రస్థాయికి చేరిందన్నారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై తనకు ఆసక్తి లేదని.. ఇన్వెస్టర్లు కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండాలని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఆర్థిక వ్యవస్థ క్రమంగా రికవరీ..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా భౌగోళికంగా పలు సవాళ్లు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ రికవరీలోనే ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. ముఖ్యంగా అంతర్జా తీయంగా ముడి చమురు ధరలు పెరగడం, ఆర్థిక పరిస్థితుల్లో అంత రాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. ఇదే సమయంలో భారత్‌లో కార్పొరేట్ల అమ్మకాలు, లాభదాయకత పెరిగిందని పేర్కొంది. బ్యాంక్‌ల రుణాల జారీలోనూ స్థిరమైన వృద్థి చోటు చేసుకుంటుందని తెలిపింది.