Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్
హైదరాబాద్ : దేశంలో గృహ రుణాల రేట్లు పెరగడంతో గత రెండు నెలల్లో నివాస గృహాల కొను గోలు స్థాయి మరింత దిగజారిందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. ప్రధాన మార్కెట్లలో సగటున స్థోమత 200 - 300 బేసిస్ పాయింట్లు తగ్గిందన్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస మార్కెట్లలో హైద రాబాద్ రెండో స్థానంలో ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. 2010లో నగరంలో 47 శాతం ఉన్న గృహ కొనుగోలు స్థోమత సూచీ 2019లో 33 శాతంగా నమోదయ్యిందని తెలిపింది. ప్రస్తుతం ఇది 31 శాతంగా ఉందని పేర్కొంది. అహ్మదా బాద్, పూణె, చెన్నరులు దేశంలోనే అత్యంత సరసమైన గృహ మార్కెట్ లుగా నిలిచాయని ఈ రిపోర్ట్ పేర్కొంది.