Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారుతీ సుజుకీ సీటీఓ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజు కి త్వరలో అన్ని మోడళ్లలో హైబ్రిడ్ టెక్నాలజీని అందుబాటులోకి తేను న్నట్టు ప్రకటించింది. వచ్చే 5-7 ఏండ్లలో అన్ని వేరియంట్లలో ఇంధన, విద్యుత్ సాంకేతికతను ఉపయోగించనున్నామని ఆ కంపెనీ సీటీఓ సివి రామన్ వెల్లడించారు. ఇందుకోసం 2026 నాటికి రూ.10,445 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్‌జీ కార్లు, ఇథనాల్, బయో సీఎన్‌జీ తదితర పర్యావరణ అనుకూల ఇంజిన్లపై మరింత దష్టి పెట్టనున్నట్టు రామన్ వెల్లడించారు.