Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలలోనే 35 శాతం పతనం
న్యూఢిల్లీ: ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ అమాంతం పడిపోతుంది. గడిచిన నెల రోజుల్లోనే ఏకంగా 35 శాతం పైగా పతనమయ్యింది. జూన్ 4న 29,681 డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ సోమవారం కాయిన్‌డెస్క్ డాట్ కామ్‌లో 19,124 డాలర్లకు క్షీణించింది. గత 11 ఏళ్లలో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. 2021 నవంబర్‌లో ఏకంగా 69వేల డాలర్లుగా పలికింది. దీంతో పోల్చితే 70 శాతం విలువ కోల్పోయింది. అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం, కీలక వడ్డీ రేట్ల పెంపు, మాంద్యం భయాలతో క్రిప్టో కరెన్సీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.