Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వ్యూహాత్మక మార్పులను గుర్తించటంలో అగ్రగామి అయిన మేరికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ (MIF), నేడు తమ 9వ "ఇన్నోవేషన్ ఫర్ ఇండియా 2023"-ను ఉద్ఘోషించారు. ముంబైలో ఫిబ్రవరి, 2023లో జరుగబోయే ఈ పురస్కారాల వేడుకలో, పురస్కారాలకై దరఖాస్తులను ఆహ్వానించారు. "మెగా వినూత్న సృజనలను" కనుగొని, వాటికీ గుర్తింపునివ్వాలనే పిపాస గల ఈ వేదిక, ఇన్నోవేటర్స్‌ని పాల్గొనటానికి ఆహ్వానించి, దేశవ్యాప్తంగా గుర్తింపు గల ఈ ఇన్నోవేషన్ అవార్డుల పోటీలో పాల్గొనమని ప్రోత్సాహపరుస్తోంది.
ఈ సంవత్సరం, ఈ వేదికలో 2 విస్తృత శ్రేణులలో గుర్తింపును అందచేయనున్నారు:
· బిజినెస్: స్టార్ట్ అప్స్ మరియు కార్పొరేట్ ఇన్నోవేటర్స్ సహితంగా భారతదేశంలో గల “ఫర్-ప్రాఫిట్ ” సంస్థలు అన్నీ
· సోషల్ : ప్రభత్వ సంస్థలు, చారిటబుల్ ట్రస్ట్లు, బహుళ పార్శ్విక ఏజెన్సీలు, సామజిక ఫౌండేషన్స్, ప్రభుత్వేతర సంస్థలు, మరియు CSR/కార్పొరేట్ నిధుల సహితంగా “నాట్-ఫర్-ప్రాఫిట్” రీతిలో పనిచేసే వ్యక్తి లేదా సంస్థల సహితంగా భారతదేశంలో గల అన్ని సంస్థలు
ఈ సంవత్సరపు ఈ అతి ప్రతిష్టాత్మక విజేతలతో స్థానం సంపాదించాలని కోరుకునే ఇన్నోవేటర్స్ పోటీలో పాల్గొనడానికి దరఖాస్తులకై వెబ్సైటు ద్వారా 27 నుంచి 31 జులై 2022 మధ్య అవధి ఉంటుంది.
దరఖాస్తు, మార్గదర్శకాలు, అర్హతలు గురించి గురించి అధిక వివరాలకై దరఖాస్తు ఫారం చూడండి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మేరికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ యొక్క ఫౌండర్, శ్రీ హర్ష్ మారీవాలా ఇలా అన్నారు, “మారుతున్న బిజినెస్ ల్యాండ్ స్కేప్‌లోకి మరుసటి తరపు ఇన్నోవేటర్స్ మరియు ఎంట్రప్రెన్యోర్స్ నీ తమ సరిక్రొత్త సృజనలతో ముందుకు రావడానికై ప్రోత్సహించి, బహుమతులు గెలుచుకునేలా చేయటం మేరికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ యొక్క వ్యక్తిగత పిపాస, ధ్యేయం మరియు మేము చేసే కృషి అంతటికీ మూలాధారం. ఆర్థిక పరిస్థితుల ఎగుడుదిగుడులలో సతమతమౌతున్న ప్రపంచానికి, ఈ సృజనలు ఈ సవాళ్లకు ఒక అనుపమానమైన మరియు వినూత్నమైన పరిష్కారాలనివ్వటంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి.”
ఈ అవార్డుల నామినేషన్లను షార్ట్ లిస్ట్ చేయటానికి సలహాదారులుగా ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ నియమించబడ్డారు. ఈ విధంగా షార్ట్ లిస్ట్ చేయబడిన దరఖాస్తులు నిష్ణాతులైన రెండు న్యాయనిర్ణేతలు బృందాలచే పరిశీలించబడతాయి - బిజినెస్ మరియు స్టార్ట్ అప్ శ్రేణులలో: రెండు పరిశీలనా సమావేశాలలో ఇది చేయబడుతుంది. ఫైనల్ విజేతలు - అనుపమానం, ప్రభావం, కొలమానం మరియు సుస్థిరత అనే నాలుగు మూల స్తంభాలవంటి అంశాల పరిగణన ద్వారా ఎంపిక చేయబడతారు.
మేరికో ఇన్నోవేషన్స్ ఫౌండేషన్, యొక్క వర్కింగ్ కౌన్సిల్ యొక్క జ్యూరీ మరియు చైర్ పర్సన్, శ్రీ అమిత్ చంద్ర ఇలా అన్నారు, "ఈ అవార్డుల ముఖ్యోద్దేశం పెరుగుదలకు అనువైన పరిస్థితులను అన్ని విధాలుగా అత్యుత్తమమైన భారతీయ ఇన్నోవేషన్స్‌కై రూపుపొందించటమే. MIF అవార్డ్స్ఈ రకమైన ప్రత్యేక సృజనలను దేశవ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిలోకీ తెచ్చి వాటిని గురించి ఎలుగెత్తి చాటడమే "
విజేతలకు పరిశ్రమ ప్రముఖులతో మరియు ఒక విస్తృత శ్రేణి పార్ట్నర్స్‌తో కలిసి నెట్‌వర్క్ చేసే అవకాశం మంచి గుర్తింపు మరియు అన్ని రకాల మాధ్యమాలలో కవరేజ్ ఆపై, ఎగ్జిక్యూటివ్ ప్రెజన్స్, పవర్ఫుల్ బిజినెస్ స్టోరీ టెల్లింగ్ వంటి అంశాల్లోలో పెర్సనలైజ్డ్ ట్రైనింగ్ & కోచింగ్ కూడా అందచేయబడుతుంది.
8వ ఎడిషన్‌లో, ఈ అవార్డులకై 650+ నామినేషన్లు అందాయి, ఇందులోంచి 6 అత్యుత్తమ ఇన్నోవేషన్స్ ఎంపికైనాయి. వాస్తవానికి ఈ విధంగా ఇంతకూ ముందు ఎంపికైన విజేతలను చాలా ముందుగానే గుర్తించటం జరిగింది; రివిగో (మొట్టమొదటి గ్లోబల్ ఐడియా మరియు భారతదేశపు యునికార్న్‌లో "డ్రైవర్ రిలే" మోడల్‌ని లాజిస్టిక్స్‌లో ప్రవేశపెట్టి ఖర్చును 40% వరకు తగ్గించటం జరిగింది); ఒలింపిక్ స్వర్ణ విజేత అయిన బొర్గోహైన్, (డిజాస్టర్ రిలీఫ్‌లో స్వత్వర స్పందన) కై గుర్తింపు పొందిన గూంజ్‌లను ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ 2020 లోనే గుర్తించటం జరిగింది. ఇవి కొన్ని పేర్లు మాత్రమే.
మేరికో ఇన్నోవేషన్స్ ఫౌండేషన్ హెడ్, శ్రీమతి ప్రియాంక కపాడియా ఇలా అన్నారు, “గత కొద్ది ఏళ్లలో భారతదేశం మహిళా ఎంట్రప్రెన్యోర్స్ యొక్క ఎదుగుదలను చూసింది. వీరు తమతమ క్షేత్రాలలో తమదైన శైలిలో ప్రభావం చూపారు. ఇన్నోవేషన్ ఫర్ ఇండియా తన 9 వ సంవత్సరంలో అడుగిడుతున్న ఈ సమయంలో నేను ఈ మహిళా ఇన్నోవేటర్స్ పయనానికి మద్దతునిస్తూ, వారు ఈ విజేతల్లో తమదైన స్థానాన్ని పొందటానికి ప్రోత్సహిస్తాను"