Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెట్టుబడుల వేదిక గ్రో, నేడు తమ 24వ ఆన్‌గ్రౌడ్ కార్యక్రమం ‘అబ్ ఇండియా కరేగా ఇన్వెస్ట్‌మెంట్’ను విజయవాడలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నగరంలోని రిటైల్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో పాల్గొంది. ఆర్ధిక విద్యా కార్యక్రమం ‘అబ్ ఇండియా కరేగా ఇన్వెస్ట్‌మెంట్’తో దేశవ్యాప్తంగా మదుపరులకు పెట్టుబడులను సరళం, సురక్షితం, అందుబాటు పద్ధతిలో మార్చడానికి లక్ష్యంగా చేసుకుంది. ‘అబ్ ఇండియా కరేగా ఇన్వెస్ట్‌మెంట్’ కార్యక్రమాన్ని 2020లో ప్రారంభించారు. గ్రో యొక్క ఈ కార్యక్రమం ద్వారా పెట్టుబడుల ప్రపంచాన్ని ప్రజలకు పరిచయం చేయనున్నారు. దానితో పాటుగా విభిన్నమైన పెట్టుబడుల అవకాశాలు గురించి వారికి అవగాహన కల్పిస్తూనే ముఖాముఖి సంభాషణల ద్వారా వారి సందేహాలను తీర్చనున్నారు. టియర్2, టియర్ 3 మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకున్న గ్రో , రిటైల్ మదుపరుల పార్టిస్పేషన్, వృద్ధి పరంగా అత్యధిక సామర్ధ్యం చూస్తోంది. తద్వారా దేశవ్యాప్తంగా విస్తృతశ్రేణి పర్యావరణ వ్యవస్ధనూ తీర్చిదిద్దుతుంది. దీనిని ఆవిష్కరించిన నాటి నుంచి గ్రో అత్యంత విజయవంతంగా ఈ కార్యక్రమాలను 20కు పైగా నగరాలలో నిర్వహించడంతో పాటుగా ఇప్పటి వరకూ రెండు మిలియన్లమంది మదుపరులపై ప్రభావం చూపింది. ప్రతి సంవత్సరం, గ్రో ఈ అబ్ ఇండియా కరేగా ఇన్వెస్ట్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 100 నగరాలో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా టియర్ 2 , టియర్ 3 మార్కెట్లలో ఒక కోటిమంది భారతీయులపై ప్రభావం చూపనుంది.
2016లో కార్యకలాపాలు ప్రారంభించిన గ్రోకు ప్రస్తుతం 30 మిలియన్‌లకు పైగా వినియోగదారులు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఉన్నారు. ఈ ప్లాట్‌ఫామ్, విజయవాడలోని యువత నుంచి చక్కటి ఆదరణ పొందింది. మరీముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అపూర్వ ఆదరణ అందుకుంది. ప్రస్తుతం, గ్రోకు ఆంధ్రప్రదేశ్‌లో 3.5 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.
ఆసక్తికరంగా విజయవాడలో గ్రో యొక్క ప్లాట్‌ఫామ్‌పై 21% మంది వినియోగదారుల వయసు 25–30 సంవత్సరాల నడుమ ఉంది. వీరిలో 20% మంది వినియోగదారుల వయసు 18–24 సంవత్సరాల నడుమ ఉండగా, 17% మంది వయసు 31–40 సంవత్సరాల మధ్య ఉంది. విజయవాడలోని మొత్తం వినియోగదారులలో 50% గ్రో యొక్క మదుపరులు స్టాక్స్‌లో పెట్టుడులు పెట్టడానికి ఆసక్తి చూపుతుంటే, 43% మంది మ్యూచువల్ ఫండ్స్, 6% మంది ఐపీఓలలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రో ప్లాట్‌ఫామ్‌పై 48% వినియోగదారులు స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంటే, 45% మంది మ్యూచువల్ ఫండ్స్‌లో, 6% మంది ఐపీఓలలో పెట్టుబడులు పెడుతున్నారు. గ్రో కో –ఫౌండర్ ; సీఓఓ హర్ష్ జైన్ మాట్లాడుతూ ‘‘ విజయవాడ మాకు అత్యంత కీలకమైన మార్కెట్‌లలో ఒకటి. ఇక్కడ రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా ఉన్నారు. అబ్ ఇండియా కరేగా ఇన్వెస్ట్ కార్యక్రమం ద్వారా మేము విజయవాడలోని మదుపరులను, మరీ ముఖ్యంగా గ్రోను తమ పెట్టుబడుల అవకాశాల కోసం ప్రధానంగా వినియోగించుకుంటున్న మదుపరులను కలుసుకున్నాము. ఈ సదస్సులలో పాల్గొన్న మదుపరులు పెట్టుబడుల ప్రపంచం గురించి తెలుసుకునేందుకు మరింత ఆసక్తి కనబరిచారు. తెలుసుకోవాలన్న వారి ఆసక్తి, వారి సంకల్పం పెట్టుబడిదారులకు సంపదను వృద్ధి చేయడంలో సహాయపడటానికి, సరైన పరిజ్ఞానం, సాధనాలతో సాధికారిత కల్పించాలనే మా మిషన్‌ను కొనసాగించడానికి మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మదుపరులు దీని పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరింత మంది మదుపరులు ఇక్కడ నుంచి పాల్గొంటారని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.