Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హెచ్1 2011 నుంచి ఇదే అత్యధికం : నైట్ ఫ్రాంక్ ఇండియా
· ఏటేటా 4% పెరుగుదలతో వృద్ధి ధోరణిని కనబర్చడాన్ని కొనసాగిస్తున్న ధరలు
· అన్ సోల్డ్ ఇన్వెంటరీ యొక్క క్వార్టర్స్ టు సెల్ (క్యూటీఎస్) 2016 హెచ్ 1లో 7.7 త్రైమాసికాలు ఉండగా, 2022 హెచ్ 1లో గణనీయంగా 4.6 త్రైమాసికాలకు తగ్గుదల
3.2 మిలియన్ చ.అ.లుగా నమోదైన ఆఫీస్ లావాదేవీ పరిమాణం
2022 హెచ్ 1లో 101% పెరుగుదల: నైట్ ఫ్రాంక్ ఇండియా
· 1.2 మిలియన్ చ.అడుగులతో ఐటీ రంగం 2022 హెచ్1లో ఏటేటా ప్రాతిపదికన 62% వృద్ధి
· లావాదేవీల్లో బిఎఫ్ఎస్ఐ వాటా 2021 హెచ్1లో 12% ఉండగా, 2022 హెచ్1 లో 22 శాతానికి వృద్ధి
ముంబై, జులై 06, 2022: హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ 2022 హెచ్1లో ఏటేటా ప్రాతిపదికన 14,693 హౌసింగ్ యూనిట్లుగా 23% వృద్ధి చెందిందని, 2011 హెచ్1 నాటి తరువాత ఇప్పుడే అత్యధిక వి క్రయాలను నమోదు చేసిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదిక ‘ఇండియా రియల్ ఎస్టేట్: హెచ్1 2022 వెల్లడించింది. కరోనా మహమ్మారి సంబంధిత అంతరాయాల నుంచి కూడా ప్రభావితం కాని పటిష్ఠ ఐటీ ఉద్యోగ శక్తితో కూడిన హైదరాబాద్ ఇండ్ల యజ మానుల బేస్ ఈ విధమైన వృద్ధిలో కీలకపాత్ర వహించింది. నూతన ఇండ్ల ఆవిష్కారాలు 2022 హెచ్1లో ఏటేటా ప్రాతి పదికన 28% పెరిగి 21,356 హౌసింగ్ యూ నిట్లకు చేరుకున్నాయి. నగర రెసిడెన్షియల్ విభాగంలో పశ్చిమ హైదరాబాద్ తన ఆధిక్యాన్ని కొనసాగించింది. 2022 హెచ్ 1లో జరిగిన మొత్తం విక్రయాల్లో ఇది 62% మార్కెట్ వాటాను పొందింది. పటిష్ఠమైన డిమాండ్ ట్రెండ్ మద్దతుతో 2022 హెచ్1లో ఏటేటా ప్రాతిపదికన క్యాపిటల్ విలువలు 4.2 శాతంతో మరింత శక్తివంతమయ్యాయి. మహమ్మారి సమయంలోనూ ఈ డిమాండ్ ధోరణి ఇలానే కొనసాగడం విశేషం. విక్రయాల్లో కానవచ్చిన ఈ పటిష్ఠ ధోరణి 2022 హెచ్ 1లో క్వార్టర్స్ టు సెల్ (క్యూటీఎస్) స్థాయిలను 4.6 త్రైమాసికాలకు తగ్గించింది.
ఆఫీస్ మార్కెట్ పనితీరు పరంగా చూస్తే, 2022 జనవరి నుంచి జూన్ వరకు అర్థ సంవత్సర కాలం హైదరాబాద్ మార్కెట్ కు సానుకూలంగా ఉంది. లావాదేవీల పరిణామాలు 101% పెరిగాయి. ఈ విక్రయాలు 2021 హెచ్1లో 1.07 మిలియన్ చ. అ.లు ఉండగా, అది 3.2 మిలియన్ చ.అ.లకు పెరిగింది. అదే సమయంలో నూతన కార్యాలయాలు పూర్తి కావడం 3.5 మిలియన్ చ.అ.లుగా నమోదైంది. హైదరాబాద్ కు చోదక పరిశ్రమగా ఐటీ రంగం ఉండడం కొనసాగుతూనే ఉంది. ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో అది ఏటేటా ప్రాతిపదికన 62% గా ఉంది. ఇది 2021 హెచ్1లో 0.8 మిలియన్ చ.అడుగులుగా ఉండగా, 2022 హెచ్1 లో 1.2 మిలియన్ చ.అ.లకు పెరిగింది. వాటాపరంగా చూస్తే బీఎఫ్ఎస్ఐ రంగం అత్యధిక పెరుగుదలను నమోదు యచేసింది. మొత్తం లావాదేవీల్లో దాని వాటా 2021 హెచ్1లో 12% ఉండగా అది 2022 హెచ్1 లో 22 శాతానికి పెరిగింది.
అద్దెల స్థాయిలు 2022 హెచ్1 లోనూ పెరగడాన్ని కొనసాగించాయి. ఏటేటా ప్రాతిపదికన 3.3% పెరిగాయి. సబర్బన్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (ఎస్బీడీ) మార్కెట్ లో తన ఆధిక్యాన్ని కొనసాగించింది. ఈ కాలానికి మొత్తం స్పేస్ లావాదేవీల్లో దాని వాటా 71% గా ఉంది.
రెసిడెన్షియల్ మార్కెట్ అప్ డేట్: H1 2022 (జనవరి – జూన్ 2022)
ఇన్ పుట్ వ్యయాలు పెరిగినప్పటికీ, నిరంతర పటిష్ఠ విక్రయాల గ్రాప్ మార్కెట్ ను బలోపేతం చేసింది. ఇళ్ల విక్రయాలు 14,693 యూనిట్లతో మొత్తం విక్రయాల్లో 23% వృద్ధిని నమోదు చేశాయి. ఆవిష్కరణలు 28% వృద్ధి చెంది 21,356గా నమోదయ్యాయి. అర్థ వార్షిక విక్రయాల పరంగా చూస్తే, 2022 హెచ్1 అనేది 2011 హెచ్ 1 నాటి నుంచి కూడా అత్యధిక విక్రయ పరిమాణాలను నమోదు చేసింది. ఇంటి వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, ఆఫర్డబిలిటీ అధికంగా ఉండడం వంటివి ఈ వృద్ధికి ప్రాథమిక చోదక శక్తులుగా నిలిచాయి.
డెవలపర్లు కూడా డిమాండ్ కదలికలకు, సెంటిమెంట్ లో మార్పునకు అనుగుణంగా కదిలారు. 2022 హెచ్1 లో 21,356 యూనిట్లను ఆవిష్కరించారు. 2021 హెచ్1 కంటే 28% అధికం. నగరం పశ్చిమ హైదరాబాద్ లో భారీ అభివృద్ధిని చవిచూసింది. మొత్తం యూనిట్లలో 62% కోకాపేట్, పీరంచెర్వు, గోపన్ పల్లి, నలగండ్ల వంటి ప్రాంతాల్లో ఇక్కడే లాంచ్ అయ్యయి. నగరం కమర్షియల్ కోర్ కు చేరువలో ఉండేందుకు ఇంటి కొను గోలుదారులు ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు కారణంగా నిలిచింది.
ధర కేటగిరీ పరంగా చూస్తే, రూ.5 నుంచి 10 మిలియన్ విభాగంలో విక్రయాల వాటా ఇళ్ల విక్రయాల్లో మెజా రిటీ గా ఉండడం కొనసాగింది. హెచ్1 2022లో దీని మొత్తం వాటా 47%గా ఉంది. హెచ్1 2021లో ఉన్న 46%తో పోలిస్తే కాస్తంత పెరిగింది. రూ. 5 మిలియన్ల వరకు ఉండే యూనిట్ల విక్రయాల వాటా 21% వద్ద నిలకడగా ఉంది. రూ.10 మిలియన్ల ధర శ్రేణి వద్ద యూనిట్లు ఇదే కాలానికి 31% నుంచి 32 శాతానికి పెరిగి కాస్తంత ఎక్కువయ్యాయి. జీవనశైలిని అప్ గ్రేడ్ చేసుకోవాలనే కోరిక, చదవు, పని ఇంటి నుంచే కొనసాగ డంతో రూ.5 మిలియన్లకు పైబడిన టికెట్ సైజుకు డిమాండ్ గణనీయంగా మారింది.
ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ (హైదరాబాద్) సామ్సన్ ఆర్థర్ మాట్లాడుతూ, ‘‘2020 లో కరోనా మహమ్మారి అవాంతరాలు ఉన్నప్పటికీ, నిలకడతో కూడిన ధర పెరుగుదలను చవిచూ సిన నగరం హైదరాబాద్ ఒక్కటే. దీని రెసిడెన్షియల్ మార్కెట్ వెనుక ఉన్న శక్తిసామర్థ్యాలను అది నిజంగా ప్రదర్శించింది. ఇక ఇదెంత మాత్రం దేశంలోని అత్యంత చౌక మార్కెట్ ప్లేసెస్ లో ఒకటి కాదు. తుది వినియోగ దారులకు, మదుపరులకు ఇది కోరుకున్న గమ్యస్థానంగా ఉంది. పరిమితికి మించిన నిర్మాణాలు, మౌలిక వసతులపై పడే భారంపై ఆందోళనలు ఉన్నప్పటికీ, రెసిడెన్షియల్ మార్కెట్ లో సెంటిమెంట్ సానుకూలంగా నే ఉంది. మధ్యతరగతి ప్రాజెక్టులు నగరంలో విక్రయాల జోరును పెంచనున్నాయి’’ అని అన్నారు.
2022 హెచ్ 1లో రంగాలవారీగా లావాదేవీల విభజన చూస్తే, 39%తో ఐటీ రంగం అగ్రభాగంలో ఉంది. 30% తో సర్వీస్ రంగం ఆ తరువాతి స్థానంలో ఉంది. మొత్తం లావాదేవీల్లో బీఎఫ్ఎస్ఐ వాటా 2022 హెచ్ 1లో 12 % నుంచి 22 శాతానికి వృద్ధి చెంది, అన్ని రంగాల్లోకెల్లా అత్యంత వృద్ధిని సాధించిన రంగంగా నిలిచింది. నగరం దేశంలోని పెద్ద పెద్ద బిఎఫ్ఎస్ఐ సంస్థలను ఆకర్షించడాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్ కు ఇది ప్రోత్సాహక సంకేతం.
ఆఫీస్ అద్దెల పరంగా చూస్తే, హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ సగటు లావాదేవీ అద్దెల విషయంలో 2022 హెచ్1లో వార్షిక ప్రాతిపదికన 3.3% వృద్ధిని నమోదు చేసింది.
మైక్రో మార్కెట్ల విషయానికి వస్తే, 2022 హెచ్1లో ఎస్ బిడి అమితంగా ఆకర్షించింది. ఈ కాలంలో జరిగిన అన్ని స్పేస్ లావాదేవీల్లో దీని వాటా 71% గా ఉంది. లావాదేవీలు జరిగిన వాటిలో అత్యధిక ఆఫీస్ స్పేస్ హై టెక్ సిటీ ప్రాంతంలో ఉంది. నగర ఆఫీస్ మార్కెట్ నాడీకేంద్రంగా అది కొనసాగనుంది.
ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ (హైదరాబాద్) సామ్సన్ ఆర్థర్ మాట్లాడుతూ, ‘‘ఆఫీస్ స్పేస్ లో అతిపెద్ద ఆక్యుపయర్ గా ఐటీ పరిశ్రమ కొనసాగనుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యూహాత్మ కంగా అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉండడంతో అది మరింత విస్తరించ నుంది. భారతీయ నిపు ణుల కోసం అంతర్జాతీయ కంపెనీలు తమ సానుకూల ధోరణులను కొనసాగిం చడంతో భవిష్యత్ లో ఈ రంగం మరింత స్పేస్ ను తీసుకోనుంది. హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వైవిధ్య టెనెంట్ బేస్ ను కలిగిఉంది. ఆఫీస్ మార్కెట్ వృద్ధికి అది మరింత అండగా నిలువనుంది. సవాళ్ల వాతావరణంలోనూ వృద్ధి చెందడంలో తోడ్పడనుంది’’ అని అన్నారు.