Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంపెనీ ప్రతిష్టాత్మక ఉత్పత్తులను అధికారిక వెబ్‌సైట్ www.hondaindiapower.com ద్వారా కొనుగోలు చేయవచ్చు
అధికారిక ఈ – కామర్స్ వెబ్‌సైట్‌ను 06 జూలై 2022న ప్రారంభించారు
తమ సంభావ్య వినియోగదారులకు అదనపు మాధ్యమం లభించింది
విస్తృతశ్రేణి ఉత్పత్తుల నుంచి ఉత్పత్తులను పరిశీలించడం, సరిపోల్చడం, కొనుగోలు చేయడం చేయవచ్చు
ప్రస్తుతం హోండా పవర్ ప్రొడక్ట్స్ డీలర్‌షిప్‌లు చేరుకోవడం కష్టంగా ఉందని భావించే వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది
న్యూఢిల్లీ, 06 జూలై 2022 : భారతదేశంలో సుప్రసిద్ధ మరియు అత్యుత్తమ శ్రేణి పవర్ ప్రొడక్ట్స్ తయారీదారు హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నేడు తమ ప్రత్యేకమైన ఈ–కామర్స్ పోర్టల్‌ను తమ అధికారిక వెబ్‌సైట్ www.hondaindiapower.comపై ప్రారంభించింది. ఈ ఆవిష్కరణతో దేశంలో ఈ–కామర్స్‌ను ప్రారంభించిన మొట్టమొదటి పవర్ ప్రొడక్ట్స్ కంపెనీగా హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నిలిచింది.
ఈ ఆవిష్కరణ సందర్భంగా తకహిరో యుఎడా – చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, అధ్యక్షుడు, సీఈఓ – హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మాట్లాడుతూ 'హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వద్ద మాకు అత్యంత కీలకమైన మార్కెట్ గా ఇండియా నిలుస్తుంది. ఈ ప్రకటనతో, మేము మా వినియోగదారులకు మరో అడుగు దగ్గరయ్యాము. కోవిడ్–19 మహమ్మారి వేళ, పలు ఈ–కామర్స్ వేదికలు ఎంతోమంది ప్రజలకు తమ నిర్ణయాలను తీసుకునేందుకు ఆధారపడతగిన వేదికలుగా నిలిచాయి. ఈ ప్రకటనతో హోండా నమ్మకమైన ఉత్పత్తులను కొన్ని క్లిక్స్‌తోనే సొంతం చేసుకోవచ్చు` అని అన్నారు.
హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రారంభించిన వెబ్‌సైట్‌పై జనరేటర్లు, వాటర్‌పంపులు, టిల్లర్స్, బ్రష్ కట్టర్స్ మొదలైనవి కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ప్రతి ఉత్పత్తిపై హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంపూర్ణమైన మద్దతునందించడంతో పాటుగా నమ్మకమైన కొనుగోలు అనుభవాలను సైతం అందించనుంది.
More information about the Honda Power Products range can be found at www.hondaindiapower.com and Facebook page /hondapowerproductsindia.