Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాయిన్ స్విచ్ ఫెమా ఉల్లంఘన..!
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ బ్రోకరేజీ ఎజెన్సీలపై మనీలాండరి ంగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అప్రమత్తమయ్యింది. క్రిప్టో కరెన్సీ ఎక్సేంజీలతో ఒప్పందాలు కుదుర్చు కుని విదేశీ మారకం నిబంధనలను అతిక్రమిస్తున్న కాయిన్ స్విచ్, కాయిన్ డిసిఎక్స్‌లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇంతక్రితం కూడా కాయిన్ డిసిఎక్స్ వ్యవస్థాపకులు సుమిత్ గుప్తాను బెంగళూరులో ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మరోసారి సమన్లు జారీ చేశా రు. ఈ రెండు సంస్థలు గత మూడేండ్లు గా నమోదు చేసిన లావాదేవీ లను ఇడి అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని సమాచారం.