Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్
హైదరాబాద్ : దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ప్రస్తుత ఏడాది ప్రథమార్థంలో గృహ అమ్మకాలు 60 శాతం పెరిగి 1,58,705 యూనిట్లకు చేరాయని రియాల్టీ కన్సల్టింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. గత తొమ్మిదేండ్ల లో ఇదే గరిష్టమని పేర్కొంది. కాగా.. ఇదే సమయంలో హైదరాబాద్‌లో కూడా 23 శాతం అమ్మకాలు పెరిగి 14,693 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపింది. 2011 తర్వాత ఇదే గరిష్ట స్థాయి అమ్మకాలని పేర్కొంది. ఏడాదికేడాదితో పోల్చితే 4 శాతం ధరలు పెరిగాయని విశ్లేషించింది.