Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక ద్రవ్యోల్బణ ప్రభావం
న్యూఢిల్లీ: తక్కువ విలువ కలిగి ఎక్కు వ వాడకం కలిగిన ఉత్పత్తులనూ ప్రజలు ఆదాయాలు లేక కొనుగోలు చేయడం తగ్గించు కుంటున్నారు. సబ్బులు, షాంపు లు, బిస్కట్లు, కూకీస్, నోట్‌బుక్, చాక్‌లేట్లు తదితర ఉత్పత్తులు ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) రంగంలో వస్తాయి. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఈ రంగం ఉత్పత్తుల అమ్మకాల్లో మందగమనం చోటు చేసుకుంది. అధిక ద్రవ్యోల్బణం ఈ పరిశ్రమను అమ్మకాలను ఒత్తిడికి గురి చేసిందని గోద్రేజ్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్) తెలిపింది. గత మూడేండ్లు గా సగటున రెండంకెల వృద్థిని నమోదు చేయగా.. క్రితం త్రైమాసికంలో ఒక్క అంకె స్థాయి పెరుగుదలను నమోదు చేసింది. ''భౌగోళిక ప్రతికూలాంశాలు, అధిక ద్రవ్యోల్బణం ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమపై అధిక ప్రభావం చూపుతున్నాయి.'' అని జీసీపీఎల్ పేర్కొంది.