Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అతిపెద్ద మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సీ ఆషాడమాసం సందర్బంగా పలు ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ప్రతీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,999 విలువ గల గిజ్‌మోర్ ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.99కి లేదా రూ.3,999 విలువ గల స్మార్ట్ వాచ్‌ను రూ.499 కే అందిస్తున్నామని బిగ్ సీ సీఎండీ యం బాలు చౌదరీ తెలిపారు. దీంతో పాటు మరో ఆకర్షణీ యమైన ఆఫర్‌ను ఇస్తున్నామన్నా రు. స్మార్ట్‌ఫోన్లు, టీవిలు, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసే వారికి సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా సులభ వాయిదా పద్దతిలో తక్షణమే ఫైనాన్స్ లభిస్తుందన్నారు. పలు బ్రాండెడ్ ఉత్పత్తులపై 51 శాతం వరకు డిస్కౌంట్, పలు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నామన్నారు.