Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మెహదీపట్నంలోని ఆలివ్ హాస్పిటల్ వద్ద నున్న ఆంకో కేర్ క్యాన్సర్ సెంటర్‌కు ఓ 35 సంవత్సరాల మహిళ అసాధారణ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ వచ్చారు. ఆలివ్‌కు రాక మునుపు పలు క్యాన్సర్ హాస్పిటల్స్‌ను ఆమెను సంప్రదించారు. కానీ సరైన చికిత్స మాత్రం ఆమెకు లభించలేదు. చికిత్స చేసినా ఆమె జీవించేందుకు 25 శాతం మాత్రమే అవకాశాలున్నాయని ఆ హాస్పిటల్స్‌లో చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఎలాగైనా బ్రతికించుకోవాలని తపిస్తూ చివరి ప్రయత్నంగా మెహదీపట్నంలోని ఆలివ్ హాస్పిటల్‌లో ఆంకో క్యాన్సర్ సెంటర్ వద్ద కన్సల్టెంట్ మెడికల్, హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్‌కు కలిశారు.
ఈ రోగి స్ధితిని సమగ్రంగా పరిశీలించిన డాక్టర్ శిఖర్, ఆమె పీహెచ్‌ం అక్యూట్ లింపోబ్లాస్టిక్ ల్యుకేమియాతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. ఈ తరహా బ్లడ్ క్యాన్సర్, తెల్ల రక్త కణాలపై ప్రభావం చూపుతుంది. అత్యుత్తమ ప్రణాళిక, సరైన చికిత్సను క్రమం తప్పకుండా అందిస్తే ఆమె జీవించేందుకు అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని రోగి కుటుంబసభ్యులకు వెల్లడించడంతో పాటుగా చికిత్సకు ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్ వివరించారు. కానీ ఆరు నెలల కీమోథెరఫీ తరువాత ఆమె ఐవీ కీమోథెరఫీ చికిత్స నుంచి ఇంటి వద్ద నోటి ద్వారా మాత్రలు తీసుకునే చికిత్సకు మారగలిగారు. మొట్టమొదటిసారిగా రోగితో పాటుగా ఆమె కుటుంబ సభ్యులకు పూర్తి నమ్మకం కలిగింది.
ఈ నమ్మకంతోనే రోగి తన చికిత్సను కొనసాగించడంతో పాటుగా తన కీమోథెరఫీ చికిత్సను పూర్తి చేసుకున్నారు. తాజాగా చేసిన వైద్య పరీక్షలలో ఆమెకు ఎంఆర్‌డీ నెగిటివ్ వచ్చింది. సుదీర్ఘకాలం పాటు క్యాన్సర్‌ను నియంత్రణలో ఉంచడానికి అది ఓ చక్కటి సూచిక.
రోగి ఇప్పుడు సాధారణ జీవితానికి తిరిగిరాగలిగారు. మరో రెండు సంవత్సరాలు ఆమె నోటి ద్వారా తగిన ఔషదాలు తీసుకోవడంతో పాటుగా క్రమం తప్పకుండా పరీక్షలనూ చేయించుకోవాల్సి ఉంటుంది.
అసలు జీవించే అవకాశాలే లేవన్న స్ధితి నుంచి సాధారణ ఆరోగ్యం పొందడం వరకూ రోగి జీవిత ప్రయాణం పట్ల ఆమె కుటుంబ సభ్యులు పూర్తి సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈమె స్థితి క్యాన్సర్ రోగులతో పాటుగా డాక్టర్లకు సైతం ఓ ఆశను కలిగించింది.
ఆంకో క్యాన్సర్ సెంటర్స్ వద్ద నిష్ణాతులైన ఆంకాలజిస్ట్‌లు ఉన్నారు. వీరు కీమోథెరఫీ, టార్గెటెడ్ థెరఫీ, ఇమ్యునోథెరఫీ, రేడియేషన్ థెరఫీ సహా అత్యాథునిక చికిత్సలనందిస్తారు. ఆంకో క్యాన్సర్ కేర్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా రోగులకు తగిన మార్గనిర్ధేశనమూ వీరు చేస్తారు. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. మెహదీపట్నంతో పాటుగా ఆంకో క్యాన్సర్ కేర్ కేంద్రాలు గచ్చిబౌలి, కెపీహెచ్‌బీ, మదీనాగూడా వద్ద ఉన్నాయి. అపాయింట్‌మెంట్స్ కోసం +91 80085 75405కు కాల్ చేయవచ్చు.