Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో క్రెడిట్ కా ర్డులను మాత్రమే జారీ చేసే అతి పెద్ద సంస్థ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో ఆదిత్యా బిర్లా కేపిటల్ లిమిటెడ్‌కు చెందిన ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమి టెడ్ జట్టు కట్టింది. ఈ భాగస్వామ్యంలో 'ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డు' ను జారీ చేశాయి. దీంతో ఫ్యాషన్, ట్రావెల్, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెం ట్, హౌటల్స్ వంటి జీవనశైలి ఖర్చులపై వినియోగదారుల కు బహు మతులు, పలు ఆఫర్లు, రివార్డులు అందిస్తున్నట్టు ఇరు సంస్థలు తెలి పాయి. ఈ కార్డు ప్రీమియం, మాస్ బ్రాండ్స్‌పై యాక్సెస్ అందిస్తుంద ని ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈఓ రామ మోహన్ రావు అమర పేర్కొ న్నారు. ఆదిత్య బిర్లా ఎస్‌బిఐ కార్డు, ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డ్ సెలక్ట్ కార్డుల వార్షిక ఫీజులను రూ.499, రూ.1,499గా నిర్ణయించాయి.