Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ట్విట్టర్‌ను తాను కొనుగోలు చేయడం లేదని టెస్లా అధినేత ఎలన్ మస్క్ తేల్చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సుమారు రూ.3.2 లక్షల కోట్లు (44 బిలియన్ డాలర్లు) చెల్లించి ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకోవడానికి తొలుత మస్క్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆది నుంచి పీఠముడులు పెట్టుకుంటూ వస్తున్న తను తాజాగా ఈ ఒప్పందం నుంచి తప్పు కుంటున్నట్లు స్పష్టం చేశారు. ట్విట్టర్‌తో చేసుకున్న ఒప్పందం సరిగ్గా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆరోపించారు. స్పామ్, నకిలీ ఖాతాలపై సమగ్రమైన సమాచారాన్ని ట్విట్టర్ ఇవ్వలేకపోయిందని, అందుకే ఒప్పందం నుంచి వైదొలుతుగున్నట్లు మస్క్ తెలిపారు. కాగా.. మస్క్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ట్విట్టర్ హెచ్చరించింది. ఈ ఒప్పందం రద్దు జరిగితే మస్క్ బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7800 కోట్లు) పరిహారం చెల్లించాల్సి ఉంటుందని షరతుల్లో ఉంది. తుదకు ఏమి జరుగుతుందో వేచి చూడాలి.