Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అసెట్ నిర్వహణ కంపెనీలలో ఒకటి అయిన Edelweiss Asset Management Limited, Edelweiss ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ అనే కొత్త ఫండ్ లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. పేరులో ఉన్నట్టుగానే, ఇది బ్రాండ్లు, మార్కెట్ షేర్ గైనర్లు ఇంకా ఇన్నోవేటర్లు అనే మూడు కీలక పెట్టుబడి మార్గాల నుండి 25-30 భారీ లాభాల అవకాశం ఉన్న స్టాక్-ల పోర్ట్-ఫోలియోను సిద్ధం చేసే ధ్యేయం ఉన్న ఫోకస్డ్ ఈక్విటీ స్కీమ్. అంతే కాకుండా, ఈ ఫండ్ మార్కెట్-క్యాప్ అలాగే ఒకే రంగానికి పరిమితం కాకుండా పెట్టుబడిదారులకు ఎక్కువ పెట్టుబడి మార్గాలను అందిస్తోంది. ఈ మూడు పెట్టుబడి రంగాల నుండి సమర్థవంతమైన స్టాక్-లతో పోర్ట్-ఫోలియోను సిద్దం చేయడం ద్వారా ఈ ఫండ్ ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్న అలాగే అభివృద్ధి చెందుతున్న అవకాశాల నుండి దీర్ఘకాలంలో మంచి లాభాలను ఆర్జించడంలో పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి విధానాన్ని పరిశీలిస్తే, ఈ ఫండ్ ఇప్పటికే స్థిరపడిన అలాగే ఇప్పుడు వృద్ధిలోకి వస్తున్న, ఇప్పటికే మంచి షేర్లు ఉన్న లేదా మార్కెట్ షేర్ పెరిగే సామర్థ్యం ఉన్న బ్రాండ్లు అలాగే కంపెనీలు, ఇన్నోవేటర్లు అలాగే డిస్-రప్టర్లలో పెట్టుబడి పెట్టడం ఈ ఫండ్ ఉద్ధేశ్యం. Edelweiss Asset Management Limited MD & CEO రాధిక గుప్తా, “భారతదేశం ప్రస్తుతం వ్యాపార వృద్ధి విషయంలో ఉత్తమ దశలో ఉంది, ఆకర్షణీయమైన డెమోగ్రాఫిక్స్, నియంత్రణలు రావడం, తయారీ రంగం వృద్ధి అలాగే వేగవంతంగా ఉన్న డిజిటైషన్ వంటి అనేక కారకాలు దీనికి దోహదం చేసాయి. భవిష్యత్తులో అభివృద్ధి పథంలో ముందుండే కీలక అవకాశాలు బ్రాండ్లు, మార్కెట్ షేర్ గైనర్లు అలాగే ఇన్నోవేటర్లు మరియు డిస్-రప్టర్ల వంటి వాటికి అనుసంధానం అయ్యి ఉంటాయని అని మా విశ్వాసం. వీటి నుండి సరైన లాభాలు పొందడం కోసం, మేము Edelweiss ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ తీసుకువచ్చాం. ఇది ఈ మూడు రంగాలలోని కంపెనీలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. మేము కొత్త ఫండ్లను అందించే విషయంలో చాలా శ్రద్ధ వహిస్తూ వచ్చాం అలాగే వాటిని సరైన సమయానికి తీసుకువచ్చాం. గత సంవత్సరం, మార్కెట్లు అలాగే విలువ అనుకూలంగా లేకపోవడం మేము గమనించాం అందుకే ఎలాంటి కొత్త ఈక్విటీ ఫండ్-లు ప్రారంభించకూడదనే నిర్ణయం తీసుకున్నాం. అయితే, కరెక్షన్ తర్వాత ఉన్న ప్రస్తుత మార్కెట్ స్థితి ఇలాంటి ఫండ్ లాంఛ్ చేయడానికి అనుకూలమైన సమయం అందుకే NFO ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం.” అని అన్నారు. Edelweiss Asset Management Limited ఈక్విటీలు-CIO త్రిదీప్ భట్టాచార్య ఇలా అన్నారు, “పెరుగుతున్న ఆదాయాలు, మద్దతునిచ్చే ప్రభుత్వ పాలసీలు, పెరుగుతున్న వినియోగం, తయారీ రంగం అలాగే మౌలిక సదుపాయాల రంగంపై దృష్టి పెట్టడం అనేవి వ్యాపార అలాగే పెట్టుబడి అవకాశాలను పెంచడానికి దోహదం చేస్తుండటంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ దృఢంగా వృద్ధి చెందడానికా సిద్ధంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, మేము Edelweiss ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ లాంఛ్ చేశాం. ఇది ఎంపిక చేసిన పెట్టుబడి అవకాశాలు అంటే, బ్రాండ్లు, మార్కెట్ షేర్ గైనర్లు ఇంకా ఇన్నోవేటర్లు మరియు డిస్-రప్టర్లలను చేర్చి పెట్టుబడిదారుల పోర్ట్-ఫోలియోలను ప్రత్యేకం సిద్ధం చేయడానికి ఉద్ధేశించినది.” “పైన చెప్పిన కారకాలు సరైన మార్గంలో ఉండి, భారతదేశం వృద్ధి చెందుతుంటే, ఇప్పటికే స్థిరంగా ఉన్న అలాగే అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లు అవకాశాలను అందిపుచ్చుకుని వారి ఉనికి మరింత బలీయం చేసుకుంటారు అని మా అంచనా. అంతే కాకుండా, దృఢమైన ఆపరేటింగ్ వ్యవస్థ లేదా పోటీలో తమకు ఉన్న అనుకూలతను సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగే కంపెనీలు మార్కెట్ షేర్ సాధించి వృద్ధిని చవి చూస్తాయి. ఆవిష్కరణలు పెరుగుతుండటంతో, ప్రస్తుత వ్యవస్థను మార్చి అద్భుతంగా విలువను పెంచే కొత్త కంపెనీలు వస్తాయి అని మా విశ్వాసం. మా ఫండ్ భారతదేశం ప్రస్తుతం ఉన్న స్థితిలో ఔచిత్యమైన పెట్టుబడి మార్గాలపై దృష్టి పెడుతోంది.” అన్నారు త్రిదీప్