Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నేడు కస్టమర్లు ఎక్కువ సాధికారత పొంది ఉన్నారు మరియు బాగా తెలిసినవారై ఉన్నారు. తత్ఫలితంగా, అద్వితీయమైన కస్టమర్ సేవ, అమ్మకాల పరిజ్ఞానము మరియు మంచి సాంకేతిక మద్దతు కొరకు ఆకాంక్షలు పెరుగుతూనే ఉంటాయి. కొనుగోలు చేయడానికి ముందు వినియోగదారులు చాలా లోతుగా పరిశోధన చేసుకుంటారు కాబట్టి ప్రతి బ్రాండుకూ పోటీ అనేది అపారమైనదిగా ఉంటుంది. కంపెనీలు తమ అవసరాలు తీర్చాలని మరియు తమ అభీష్టం మరియు సౌకర్యం ఉన్న మార్గాల్లో తమ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని వారు ఆశిస్తారు. పెద్ద కొనుగోళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఇది మరింత ముఖ్యం అవుతుంది. వినియోగదారులు మీ ప్రోడక్టును కొనుగోలు మాత్రమే చేయరు, ఐతే తాము అందుకునే తదనంతర సర్వీసు కూడా తమ ఆకాంక్షలకు అనుగుణంగా మరియు సులభంగా లభించేలా ఉండాలని వారు ఆశిస్తారు. అందుకనే, కస్టమరు యొక్క కొనుగోలు నిర్ణయములో విక్రయానంతర సేవ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కంపెనీల కోసం, విక్రయానంతర సేవ అనేది కస్టమరు సంతృప్తి మరియు విశ్వసనీయతను నిర్ధారించుకోవడానికి నిజమైన వ్యూహాత్మక సాధనంగా ఉంటుంది. కస్టమర్లతో పరస్పర విశ్వాసం యొక్క సంబంధబాంధవ్యాలను ఏర్పరచుకోవడానికి అది వారికి వీలు కలిగిస్తుంది,బ్రాండు ప్రతిష్టను పెంచుతుంది, వంపును అధిగమించడానికి వారికి సహాయపడుతుంది, మరియు కస్టమర్ సలహాను ముందుకు నడుపుతుంది. అందుకు విరుద్ధంగా, పేలవమైన కస్టమర్ సర్వీస్ అనేది కంపెనీ యొక్క ప్రతిష్ట మరియు పనితీరు పట్ల ప్రతికూల ప్రభావాన్ని చూపగలుగుతుంది.
కాబట్టి, విక్రయానంతర సేవలో మీరు మీ బిజినెస్‌ని మరింత సమర్థవంతంగా చేసుకోవాలని గనక చూస్తుంటే, మీకు సహాయపడేందుకు ఇవిగో ఇక్కడ కొన్ని చిట్కాలు:
ఒక ధృఢమైన లాజిస్టిక్స్ వ్యవస్థను నిర్మించుకోండి: మంచి వ్యారెంటీ మరియు రిటర్నుల పాలసీ ఉండే కంపెనీ పట్ల కస్టమర్లు చాలా ఎక్కువ విశ్వసనీయంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కస్టమర్లలో విశ్వాసం పెంపొందడానికి మరియు ఒకవేళ ఏదైనా లోపం కనిపించినప్పుడు ప్రోడక్టును తిరిగి వెనక్కి ఇవ్వడానికి లేదా మార్పిడి చేసుకోవడానికి తమకు ఎటువంటి సమస్య ఉండబోదని తెలిసినప్పుడు బ్రాండు నుండి కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తపరచేందుకు సహాయపడుతుంది. బ్రాండులు ఇంటిముంగిటనే పికప్ మరియు డ్రాప్ సర్వీసును మరియు పరికరాల్ని ఇంటివద్దనే మరమ్మత్తు చేసే సేవలను కూడా ప్రారంభించాయి. ఈ ప్రయత్నాలు కస్టమర్లలో నమ్మకాన్ని మరియు విశ్వసనీయతను నెలకొల్పుతాయి మరియు వారితో శ్రమ లేని సంభాషణలు చేయడానికి అవకాశం కలిగిస్తాయి.
కస్టమర్లు చెప్పేది శ్రద్ధగా వినండి: అత్యుత్తమమైన ప్రోడక్టు శ్రేణితో ఒక బ్రాండు కస్టమర్ సంతృప్తిని సాధించవచ్చు, ఐతే కస్టమర్ ఆనందాన్ని మరియు విశ్వసనీయతను సాధించడానికి చేసే ప్రయాణము కస్టమరు ఒక బ్రాండుతో కొనుగోలుకు ముందు మరియు ఆ తర్వాత కలిగి ఉండే నిరంతరాయమైన, ఒక చివర నుండి మరో చివరి వరకు అనుభవంగా చెప్పబడుతుంది. ఒక విశ్వసనీయమైన కస్టమరును ఏర్పరచుకోవడం ద్వారా, బ్రాండు నోటిమాట ప్రచారం ద్వారా అనేక ఇతర కస్టమర్ల కొరకు బాటలు వేసుకుంటుంది, అది ఇండియాలో అత్యంత నమ్మకమైన మార్గాలలో ఒకటిగా నిలిచిపోయింది. అంతరాయం లేని కస్టమర్ సర్వీసును అందజేయుటకు గాను, కస్టమర్ విజ్ఞప్తుల త్వరిత పరిష్కారం కోసం బ్రాండులు 24x7 అందుబాటులో ఉండే చాట్ బోట్‌లు మరియు వాయిస్ బోట్‌లు అదేవిధంగా వాట్సాప్ వర్క్ ఆర్డర్లను తీసుకోవడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించుకుంటున్నాయి.
మంచి కస్టమర్ మద్దతు ఏర్పాటులో పెట్టుబడి చేయండి: విక్రయానంతర సర్వీసును సానుకూలం చేసుకోవడం వల్ల రాబడులు, స్థూల లాభాలు మరియు పని సంబంధిత సమర్థతలో మెరుగుదలకు మాత్రమే కాకుండా, మొత్తంమీద కస్టమర్ అనుభవానికి కూడా దారి తీస్తుంది. నేటి కస్టమర్లు ఎల్లప్పుడూ పని చేసే ప్రోడక్టులను కోరుకుంటారు, మరియు నానాటికీ పెరుగుతున్న కస్టమర్ ఆకాంక్షలు, తయారీదారులు తాము తరచూ చేసే తక్కువ సానుకూలత గల విక్రయానంతర సేవల పనులను గరిష్టంగా సమయానుకూలంగా చేసేలా పురిగొల్పుతున్నాయి.
కస్టమర్ సర్వీస్ ఏజెంట్లకు సముచితమైన శిక్షణ: మీ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లు సముచితమైన శిక్షణా సామాగ్రి మరియు సమాచారానికి ప్రాప్యత కలిగి ఉండడం అవసరము, తద్వారా వారు శ్రేష్టమైన సేల్స్ సపోర్టును అందించగలుగుతారు. మీ కస్టమర్లను సంతృప్తిపరచడానికి తగినంత పరిజ్ఞానం మరియు వారి ప్రశ్నలు మరియు అభ్యర్థనలకు స్పందించడానికి తగిన ప్రావీణ్యం వారికి ఉండాలి. తమంతట తాముగా క్లెయిములను పరిష్కరించలేని మరియు తమ మేనేజరు లేదా తోటి సహోద్యోగి నుండి సహాయం కోరని ఉద్యోగులు, కంపెనీపై పేలవమైన ప్రభావం పడేలా ఉద్యోగి అసహనానికి దారి తీస్తారు. మీ ఏజెంట్లకు తగినంతగా శిక్షణ ఇవ్వడమనేది కస్టమర్ సర్వీస్ అనుభవం చెడి పోకుండా నివారించగలుగుతుంది.
మీ CRM ను హుషారుగా ఉంచుకోండి: కస్టమర్లు నిరంతరంగా వెళుతుంటారు మరియు కొత్తవాళ్ళు వస్తుంటారు కాబట్టి, వారు కోరుకునే అనుభవాల రకాలను కచ్చితంగా అందించడంపై దృష్టి సారించడం మరింత ముఖ్యమై ఉంటుంది. మరియు అనుభవాలను సానుకూలం చేసుకోవడానికి, కంపెనీలు చురుకుగా, అలవరచుకునే వారుగా మరియు CRM నుండి గోతులను నిర్మూలించేవారుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ లక్ష్యిత ప్రేక్షకులను లోతుగా పరిశోధించండి, గుర్తించండి మరియు అర్థం చేసుకోండి మరి ఆ తర్వాత మీ కస్టమరు యొక్క అవసరాల్ని తీర్చడానికి అట్టి డిజిటల్ అనుభవాల రూపకల్పనకు ఆ సమాచారాన్ని ఉపయోగించుకోండి. ఒక ఘనమైన CRM వ్యవస్థ బిగుతైన తిరిగిరాక సమయాన్ని(TAT) కలిగి ఉంటుంది – ఒక గంట లోపు, లేదా ఒక్క రోజులో లేదా ఒక్క సందర్శనలో సర్వీస్ చేయగల ఉపకరణాలతో. తక్కువ (30 రోజుల) మార్పిడి వ్యవధి, ప్రాంతీయ భాషలలో కస్టమర్ మద్దతు మరియు రిపేర్ పైన EMI – మీ లక్ష్యిత కస్టమర్లలో బ్రాండు అనుబంధమును వృద్ధి చేసుకోవడానికి ఇవి కొన్ని CRM చర్యలు.
ఈనాటి కస్టమరు మన్నిక, నాణ్యత, విశ్వసనీయత మరియు విక్రయానంతర సేవల కొరకు చెల్లిస్తారు. సజావైన మరియు నిరంతరాయమైన కస్టమర్ సర్వీసును నిర్ధారించుకోవడానికి, బ్రాండులు వారి స్థానంలో ఉండి మరియు ప్రాప్యత చేసుకోగలిగేలా ఉండాలి. కస్టమర్లలో విశ్వాసం, సహానుభూతి మరియు నమ్మకాన్ని పెంచుకోవడం కోసం సాంకేతికతను మానవీకరించడానికై వివిధ బ్రాండులు అర్థవంతమైన ఆవిష్కరణను వాడుకుంటున్నాయి. అర్థవంతమైన ఆవిష్కరణ అంటే వినియోగదారు కొనుగోలు ప్రయాణాన్ని సులభతరం చేయడం మరియు దానిని ఆకట్టుకునేలా చేయడం అన్నమాట. బ్రాండులు ఒక అడుగు ముందుకు వేసి మరీ కస్టమర్ అనుభవాన్ని మానవీయం చేసుకుంటున్నాయి మరియు తమ వినియోగదారులకు విలువను తెస్తున్నాయి. ఉదాహరణకు, స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు తమ ఉపకరణాలలో భద్రత, వాడుక సౌలభ్యత, మరియు ప్రభావశీలత వంటి అంశాలను చేరుస్తున్నారు.
బ్రాండులు ఇప్పుడు లక్ష్యిత ప్రేక్షకులతో సమాచార వినిమయాన్ని దశల వారీగా చేసుకుంటున్నాయి – అంటే, ముందస్తు-వేడిమి దశలో, ప్రోడక్టు ఆవిష్కరణ దశలో మరి ఆ తర్వాత సుస్థిరపరచు (విక్రయానంతర) దశలో ఒకే సందేశాన్ని నిర్వహణ చేయడం అన్నమాట. అనవసర విషయాలు లేకుండా కస్టమర్లతో అధీకృత తీరులో సంభాషించడం మరియు వారిని హత్తుకునేలా సుస్థిరమైన సందేశాన్ని అందించడం అనేది, ధృఢమైన, చిరకాలం నిలిచి ఉండే బ్రాండ్-కస్టమర్ సంబంధబాంధవ్యాలను సుస్థిరం చేసేవరకూ వెళుతుంది.
మంచి కస్టమర్ అనుభవం అనేది ముందస్తు ప్రణాళిక మరియు వ్యూహాత్మకతతో మొదలవుతుంది. మీ కస్టమరుకు మీ ప్రోడక్టు లేదా సేవ అనేది సరిగ్గా సరిపోయేది అయినప్పుడు, ఎప్పుడూ ఉండే మూల సమస్యల కారణంగా వారిని కోల్పోయేలా చేసుకోవద్దు. కొనుగోలు-అనంతర కస్టమర్ అనుభవం అనేది ప్రాధాన్యత అంశము. తర్వాతి కొనుగోలు కోసం, శ్రేష్టమైనటువంటి విక్రయానంతర అనుభవము కచ్చితంగా చెప్పుకోదగ్గ అంశమై ఉంటుంది. ఏ వ్యాపారానికైనా ప్రస్తుతమున్న కస్టమర్లు నిధి వంటి వారు, అయినా అనేక బ్రాండులు వారిని విస్మరిస్తుంటారు మరియు కొత్త కస్టమర్లను సంపాదించుకోవడంపై దృష్టి సారిస్తుంటారు. మీరు పాత నానుడిని బాగా గుర్తు పెట్టుకోవాలి: తిరిగి కొనుగోలు చేయడానికి ఒక కొత్త కస్టమరును సంపాదించుకోవడం కంటే ప్రస్తుతమున్న కస్టమర్లను ఒప్పించడం అనేది చాలా చౌక అయిన పని. మీరు మీ ప్రస్తుత కస్టమర్లను ఒక విశ్వసనీయమైన కస్టమర్ పునాదిగా మలచుకోవాల్సిన అవసరం ఉంటుంది.