Authorization
Wed May 07, 2025 08:29:50 am
- బుక్ మై ఫారెక్స్ వెల్లడి
గూర్గావ్ : మేక్ మై ట్రిప్ గ్రూపునకు చెందిన ప్రముఖ ఆన్లైన్ విదేశీ మారకద్రవ్య మార్పిడి సేవల సంస్థ బుక్ మై ఫారెక్స్ డాట్ కామ్‌లో ఇకపై 24గంటల రెమిటెన్స్ సేవలను పొందవచ్చని తెలిపింది. తమ వినియోగదారులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన అనుభవాలను అందించేందుకు ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది. వినియోగదారులు ఫారెక్స్ రేట్లను మూడు రోజుల వరకూ 'బుక్ నౌ, పే లేటర్' కింద లాక్ చేసుకోవచ్చని పేర్కొంది. పూర్తి ఆన్లైన్, పేపర్ రహిత సేవలను అందిస్తున్నామని బుక్ మై ఫారెక్స్ డాట్ కామ్ సీఈఓ సుదర్శన్ మొత్త్వానీ తెలిపారు.