Authorization
Wed May 07, 2025 02:46:29 am
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ అసుస్ తమ కన్స్యూమర్ నోట్‌బుక్ శ్రేణిలో ఆరు నూతన క్రియేటర్ సిరీస్ ల్యాప్‌టాప్ లను ఆవిష్కరించినట్టు ప్రకటించిం ది. కంటెంట్ క్రియేటర్లు, వినియో గదారుల కోసం సృజనాత్మకంగా తీర్చిదిద్దిన ఈ నూతన శ్రేణి అసుస్ క్రియేటర్ సిరీస్ ల్యాప్‌లలో ఫ్లాగ్షిప్ జెన్‌బుక్ ప్రో 14 డ్యూయో ఓఎల్ఈడీ, ప్రో 16ఎక్స్ ఓఎల్ఈడీతో పాటుగా ప్రో ఆర్ట్ స్టూడియోబుక్ 16 ఓఎల్ఈడీ, 16 ఓఎల్ఈడీ, వివోబుక్ ప్రో 15 ఓఎల్ఈడీి, 16 ఎక్స్ ఓఎల్ఈడీలు ఉన్నాయని తెలిపింది. నూతన జెన్‌బుక్ శ్రేణి రూ.1,44,990తో, స్టూడియో బుక్ శ్రేణి రూ.1,99,990తో, వివోబుక్ ప్రో లైనప్ రూ.67,990తో ప్రారంభమవుతాయని వెల్లడించింది.