Authorization
Wed May 07, 2025 06:02:50 am
హైదరాబాద్ : దేశం యొక్క ప్రీమియం స్థిరాస్థి వ్యాపారం, పెట్టుబడి యాజమాన్యములో ప్రత్యేకత గల అతిపెద్ద వృత్తిపర సేవల సంస్థ జెఎల్ఎల్, నేడు మ్యాపిక్ ఇండియా 2022లో “ఆవిష్కరించు.వ్యత్యాసపరచు. పెంపొందించు. 2022 లో మరియు అతీతంగా రిటైల్ రంగం ,” పేరుతో నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక, రిటైల్ విభాగం మరియు షాపింగ్ మాల్స్ లో కొన్ని ముఖ్యమైన పోకడల పట్ల గ్రాహ్యతను అందిస్తుంది. భారతదేశం లోని అతిపెద్ద ఏడు నగరాలు (ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, కోల్కతా, చెన్నై, మరియు హైదరాబాద్) లో గ్రేడ్ A* షాపింగ్ మాల్స్ యొక్క స్టాకు H1 2022 లో 90.6 మిలియన్ చదరపు అడుగులు ఉంది. మాల్ స్టాకులో 50% కి మించి వరుసగా ఢిల్లీ ఎన్.సి.ఆర్ (29 మిలియన్ చదరపు అడుగులు) మరియు ముంబై (19 మిలియన్ చదరపు అడుగులు) లో ఉంది. పుణె, బెంగళూరు, ముంబై, మరియు హైదరాబాదు నగరాల్లో చేర్పులతో H1 2022 లో మాల్ సరఫరా సుమారు 1.3 మిలియన్ చదరపు అడుగులుగా నమోదు అయింది. సంస్థాగత మదుపరులు మరియు ప్రతిష్టాత్మకమైన డెవలపర్లు కూడా తమ దృష్టిసారింపును టయర్-II మరియు టయర్ III నగరాలపై పెంచుతున్నారు. “మహమ్మారి కారణంగా ఎక్కువ కాలం పాటు దేశంలోని రిటైల్ రంగం ఒత్తిడి క్రింద కుదేలై పోయింది. అయినప్పటికీ, మార్చ్ 2022 నుండి, అనుకూలమైన నైసర్గికాలు, శీఘ్ర పట్టణీకరణ, మరియు పెరుగుతున్న వినియోగం వల్ల అంతే సమానంగా వేగవంతమైన రికవరీ ఉంటూ వస్తోంది. ఈ అంశాలన్నీ కలగలిసి, ఈ రంగం యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. రిటైల్ రంగం లోని ఎదుగుదల సంభావ్యతతో, పెట్టుబడి చేయువారు దీర్ఘకాలములో ఆరోగ్యవంతమైన రాబడులను ఆశిస్తున్నారు. సుస్థాపితమైన డెవలపర్ల నుండి పెట్టుబడి చేయువారు నాణ్యమైన గ్రేడ్-1 ఆస్తుల కోసం చూస్తున్నారు మరియు స్వల్ప వేకెన్సీని కలిగి ఉంటున్నారు. అంతర్జాతీయ మరియు జాతీయ రిటైలర్లచే బలమైన కౌలు చర్యతో రిటైల్ మార్కెట్ పుంజుకుంటూ ఉండటంతో, సుపీరియర్ గ్రేడ్ -ఎ స్థిరాస్తుల్లో ఖాళీ అనేది నిలకడగా తగ్గుతూ వస్తోంది. సమంజసమైన మార్కెట్ రెంటల్స్ మరియు సకాలములో రాబడులు ఉండేలా చూసుకోవడానికై పెట్టుబడి చేయువారు కౌలు-ఆధారిత స్థిరాస్తుల పట్ల ప్రాధాన్యత చూపుతున్నారు. టయర్-II మరియు టయర్ III నగరాలలో కూడా గణనీయమైన కార్యకలాపాలు నమోదయ్యాయి కాబట్టి రిటైల్ స్థిరాస్థుల్లో పెట్టుబడి చేయడమనేది కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు,” అన్నారు జెఎల్ఎల్, ఇండియా ఆఫీస్ లైజనింగ్ అడ్వైజరీ మరియు రిటైల్ బిజినెస్ అధిపతి రాహుల్ అరోరా. “టయర్-II మరియు టయర్ III నగరాలు వ్యవస్థాపిత డెవలపర్ల ద్వారా నాణ్యమైన రిటైల్ ఆస్తుల గణనీయమైన సరఫరాను చూస్తున్నారు. అదనంగా, డెవలపర్లు ప్రాజెక్టు నుండి పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ నిష్క్రమించడానికి, తమ ఋణభారాన్ని తగ్గించుకొని మరియు ఇతర అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి సారించడానికి ఈ పెద్ద సంస్థాగత దిగ్గజాలచే పెట్టుబడులు వారికి సహాయపడుతున్నాయి,” అని ఆయన జోడించారు. 2021 లో ఈ నాటి వరకూ (పోర్ట్ ఫోలియో వ్యవహారాలు మినహాయించి) USD 862 మిలియన్ కి పైగా నమోదు కావడంతో రిటైల్ రంగములో సంస్థాగత అభివృద్ధి పుంజుకుంటోంది. వినియోగదారులు మరియు రిటైలర్లు ఉభయులు కూడా సుపీరియర్- గ్రేడ్ మాల్స్ కి ప్రాధాన్యమిస్తున్నట్లుగా చూస్తున్నాము. కాబట్టి, వేకెన్సీ పోలరైజేషన్ కి దారి తీస్తూ సుపీరియర్ మరియు సగటు మాల్స్ లో వేకెన్సీల మధ్య విస్తృతమైన లోటు ఉంటోంది. “ఇండియా లోని ప్రధానమైన ఏడు నగరాలలో H2 2022-2025 సందర్భంగా మొత్తం 31.02 మిలియన్ చ.అడుగుల రిటైల్ స్థలముతో 70 కంటే ఎక్కువ షాపింగ్ మాల్స్ పనిచేయడం మొదలవుతుందని ఆశించబడుతోంది. రాబోవు సప్లైలో 48% వాటాతో ఢిల్లీ NCR మరియు చెన్నై ప్రధాన దోహదకారులుగా ఉండబోతున్నాయి. బెంగళూరు మరియు హైదరాబాదు కూడా 2025 వరకూ మొత్తం సప్లైలో 30% సంయుక్త వాటాతో గణనీయమైన రిటైల్ సరఫరా కలిగి ఉన్నాయి. తేలికైన డిమాండుతో, వ్యవస్థాపితమైన డెవలపర్లచే ఘనమైన సప్లై పైప్లైన్ 2025 నాటికి పనిచేయడం మొదలవుతుందని ఆశించబడుతుండడాన్ని గమనించడమనేది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది” అన్నారు, జెఎల్ఎల్, ఇండియా ఛీఫ్ ఎకనమిస్ట్ మరియు హెడ్ ఆఫ్ రీసర్చ్ మరియు REIS డా. సమంతక్ దాస్.
సుపీరియర్ క్వాలిటీ ఉండే మాల్స్ పట్ల గిరాకీ పెరుగుతూ ఉంది
సుపీరియర్ గ్రేడ్ షాపింగ్ మాల్స్ కి అత్యధిక డిమాండ్ ఉంది, అది అత్యధిక రాకపోకలు మరియు అమ్మకాలను వాగ్దానం చేస్తుంది. కాబట్టి, అటువంటి మాల్స్ లో వేకన్సీ ‘మంచివి’ మరియు ‘సగటు’ మాల్స్ కంటే తక్కువగా ఉంది. వినియోగదారులు కూడా సమీకృతమైన అద్దెదారుల మిశ్రమాన్ని మరియు మంచి మాల్ నిర్వహణ మరియు మౌలిక వసతులు అందించే సుపీరియర్ మాల్స్ కోసం చూస్తున్నారు.
ఓమ్నీఛానల్: ఇప్పుడు ముఖ్య రిటైల్ వ్యూహములో భాగంగా ఉంది
గడచిన రెండు సంవత్సరాలలో, కస్టమర్లను గ్రహించుకొని నిరంతరాయమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికై రిటైలర్లు ఒక బలమైన ఓమ్నీఛానల్ ప్లాట్ఫామ్ ను నిర్మించుకున్నారు. సంభాషణాత్మక మరియు సమస్త-చేకూర్పు గల ఇన్-స్టోర్ అనుభవాన్ని అందించడానికై భౌతిక మరియు డిజిటల్ అనుభవం యొక్క సమీకృత ప్రక్రియ జరుగుతూ ఉంది. కస్టమర్లకు భౌతిక స్టోరులతో పాటుగా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి రిటైలర్లు తమ బ్రాండ్ వెబ్సైట్లను ఆధునీకరిస్తున్నారు మరియు తమ షాపింగ్ యాప్స్ ని ఆవిష్కరిస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ పట్ల మార్పిడి అవుతున్న పోకడ ఆహార మరియు పానీయ విభాగములో కూడా నిరూపితమవుతోందని నివేదిక చెబుతోంది. మహమ్మారి అనంతరం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వేగం పుంజుకుంది. ఇది ఇండియాలో క్లౌడ్ కిచెన్ల భావజాలాన్ని పెంపొందింపజేసింది. ఇటుక మరియు మోర్టార్ రూపాల్లో మాత్రమే ఆపరేట్ చేస్తున్న కొందరు ఆహార మరియు పానీయాల వ్యాపారులు కూడా ఈ రంగం లోనికి ప్రవేశించారు.
ఆహార మరియు పానీయ విభాగానికి అధిక కేటాయింపు, ఐతే ఫుడ్ బ్రాండులు మరియు రకాలను అప్గ్రేడ్ చేయడమనేది కీలకం
మహమ్మారి సందర్భంగా నిర్బంధాలు మరియు పరిమిత సామర్థ్యపు నియమాల కారణంగా ఆహార మరియు పానీయాల వ్యాపారం దారుణంగా ప్రభావితమయింది. అయినప్పటికీ వినియోగదారులు షాపింగ్ మాల్ కి రావడానికి ప్రధాన కారణాల్లో ఇప్పుడు ఆహార మరియు పానీయ విభాగం ఒకటిగా ఉంది. కొన్ని షాపింగ్ మాల్స్ లో ఆహార మరియు పానీయ విభాగానికి చోటు కేటాయింపు కోవిడ్-ముందు కాలములో ఉన్న 12-15% నుండి ఇప్పుడు 25-30% కి పెరిగింది. అయినప్పటికీ, ఈ కేటాయింపు ప్రాంతము మరియు మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే అది మార్కెట్ మెచ్యూరిటీ, రిటైల్ అభివృద్ధి యొక్క రకం, మరియు ఆ ప్రాంతములో ఉండే ఆహార మరియు పానీయాల ఆపరేటర్లు వంటి అంశాలచే ముందుకు నడుస్తుంది. చక్కని నిర్మాణముతో కూడిన మరియు సమతుల్యమైన ఆహార మరియు పానీయ విభాగ అందజేత షాపింగ్ మాల్స్ లో వైవిధ్యతను చేకూరుస్తుంది. ఒక మాల్ యొక్క సమగ్ర అందజేతల లోనికి ఆహార మరియు పానీయ విభాగాన్ని మెరుగ్గా సమీకృతం చేయడానికి చర్యలు తీసుకోబడుతున్నాయి.
ముగింపు
వినియోగములో పెరుగుదల కేవలం మెట్రోలకే పరిమితం కాలేదు, ఐతే టయర్ II మరియు టయర్ III నగరాలకు కూడా విస్తరించింది. గణనీయంగా, అమ్మకాల్లో పెరుగుదల ఆన్లైన్ రిటైలింగ్ మరియు బ్రిక్-అండ్-మోర్టార్ స్టోరులతో సహా అన్ని ఛానళ్ళ వ్యాప్తంగా నడుపబడుతోంది. ఓమ్నీఛానల్ వేదికను బలోపేతం చేయడానికై రిటైల్ విభాగం తనకు తానుగా స్వయంగా ఆవిష్కరించుకొని రూపాంతరం అవుతుందని ఆశించబడుతోంది. ఓమ్నీఛానల్ రిటైలింగ్ యొక్క గణనీయత గుర్తించబడుతుండగా, భౌతిక స్టోరులు కొనుగోలుదారులకు మానవ సంబంధాలు మరియు'అనుభవాన్ని' అందిస్తున్నాయి కాబట్టి అవి కూడా
అంతే సమానంగా ముఖ్యమైనవని అంగీకరించబడుతోంది. కాబట్టి, రిటైలర్ల యొక్క విస్తరణ వ్యూహాలలో భౌతిక స్టోరులు కేంద్ర బిందువుగానే నిలిచి ఉంటాయి.
రిటైల్ విభాగం యొక్క బలమైన తిరిగిరాక ఫలితంగా, మాల్స్ లో లీజింగ్ డిమాండు 2023 నాటికి విస్తరించి, మహమ్మారి పూర్వ స్థితిని దాటి వెళుతుందని ఆశించబడుతోంది. ఈ రంగం యొక్క అంతర్లీన ఎదుగుదల సంభావ్యత ఎంతో ఘనమైనదిగా ఉంది, మరియు సంస్థాగతమైన పెట్టుబడి దానిని మరింత పెంచుతుందని ఆశించబడుతోంది. ఇది, షాపింగ్ మాల్స్ యొక్క నిర్వహణా వాతావరణములో మరింత పారదర్శకత మరియు మెరుగుదలను తీసుకువస్తుంది. సంస్థాగత పెట్టుబడిదారులు సుపీరియర్ గ్రేడ్ పోర్ట్ ఫోలియోలను నిర్మించుకుంటున్నారు కాబట్టి రిటైల్ రంగములో ప్రవేశం తర్వాతి పెద్ద ముందడుగు అవుతుంది.