Authorization
Wed May 07, 2025 04:06:19 am
హైదరాబాద్: ఇన్స్టాంట్ కాఫీ దిగ్గజం సిసిఎల్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీశాంత్ ప్రతిష్టాత్మక భారత కాఫీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇన్స్టాంట్ కాఫీ తయారీదార్ల తరఫున సభ్యుడిగా బోర్డు ఆయనను ఎంపిక చేసింది. ప్రపంచ కాఫీ పరిశ్రమలో శ్రీశాంత్‌కు 18 ఏళ్ల అనుభవం ఉంది. 'కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో సభ్యునిగా నియమితులైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలో కాఫీ పరిశ్రమ వద్ధికి మార్గనిర్దేశం చేయడంలో భాగమయ్యాను. అంత ర్జాతీయ కాఫీ రంగంలో భారతీయ కాఫీ ఉనికిని చాటేందుకు బోర్డు లోని ఇతర సభ్యులతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను' అని ఈ సందర్భంగా శ్రీశాంత్ తెలిపారు.