Authorization
Wed May 07, 2025 06:38:37 am
- ఈ - బ్యాంక్ గ్యారెటీ అభివృద్ధికి నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ భాగస్వామ్యం
- వేగవంతమైన, డిజిటల్, కాగిత రహిత సేవలు ఇచ్చేందుకు ఈ-బ్యాంక్ గ్యారెంటీలకు వలస వెళుతున్న బ్యాంకు
హైదరాబాద్: భారతదేశంలో అతి పెద్ద ప్రైవేటు వలయానికి చెందిన బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ నెల 4న నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (NeSL) భాగస్వామ్యంలో ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ (e-BG) వితరణ చేసిన మొదటి బ్యాంకుగా నిలిచింది. కాగితం అవసరమయ్యే, సమయం పట్టే ప్రక్రియను కొత్త ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీతో పరిష్కరించేందుకు అవకాశం ఉండగా, దాన్ని ఉన్నతీకరించిన, సురక్షతతో సంస్కరణ, స్టాంప్, పరిశీలించి, వితరణ చేయవచ్చు. దీన్ని మార్పుకు అనుగుణమైన చర్యగా, బ్యాంకు తన వినియోగదారులు అందరికీ అనుకూలతను కల్పించేందుకు ఇబిజికు బదిలీ కానుంది.
కాగితంపై ఆధారపడి ఉండే బ్యాంకు గ్యారెటీలు బ్యాంకు నుంచి భౌతికంగా తీసుకోవడం, లబ్ధిదారులకు కొరియర్ చేయడం, స్టాంప్ చేయడం, మరోసారి పరిశీలించే ప్రక్రియకు 3-5 రోజుల సమయం తీసుకుంటుంది. ఇదే కాకుండా, ఇప్పటి వరకు బ్యాంక్ గ్యారెంటీల కేంద్ర ఖజానా ఇప్పటి వరకు అందుబాటులో లేదు. సమయాన్ని దక్షతతో వినియోగించుకునే దిశలో ఇబిజి ఉన్నతీకరించిన భద్రత అందిస్తుంది. భౌతిక స్టాంపింగ్ స్థానంలో ఇ-స్టాంపింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇబిజితో అర్జీదారులు, లబ్ధిదారులు తక్షణమే ఎన్ఇఎస్ఎస్ పోర్టల్‌లో బ్యాంకు గ్యారెంటీని వీక్షించవచ్చు.
దీని గురించి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆపరేషన్స్ గ్రూపు హెడ్ భవేష్ జవేరి మాట్లాడుతూ, ‘‘డిజిటైజేషన్ మా ధ్యేయోద్దేశ సాధనను సాధ్యం చేసేలా వినియోగదారులకు చక్కని అనుభవాన్ని అందించే బ్యాంకుగా గుర్తించడంలో ముఖ్యంగా ఉంది. మేము డిజిటల్ బ్యాంకింగ్ సరళ, సందర్భోచిత మరియు సురక్షితంగా ఉంచేందుకు ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు కట్టుబడి ఉన్నాము. బ్యాంకు గ్యారెటీ వితరణ డిజిటైజేషన్ బ్యాంకు గ్యారెంటీ ప్రముఖ దరఖాస్తుదారుల ఎంఎస్ఎంఇలకు లావాదేవీలను నిర్వహించడాన్ని సరళీకృతం చేయడాన్ని వృద్ధి చేయడంలో మార్పుకు సరికొత్త అడుగుగా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మా వినియోగదారులకు బ్యాంకు గ్యారెంటీలను సరళీకృతం చేసేందుకు సంపూర్ణంగా ఇబిజి ప్లాట్ఫారానికి వలస వెళుతోంది’’ అని తెలిపారు. ఇ-బిజిను ఎన్‌ఇఎస్‌ఎల్, సివిజి-సిబిఐ కమిటీ, ఐబిఎ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయగా, ఇది ప్రక్రియను సరళీకృతం చేస్తుంది. వంచన అలాగే మార్పిడి సాధ్యతలను అడ్డుకుంటుంది. ఇ-బిజిను ఎన్‌ఇఎస్‌ఎల్ పోర్టల్‌లో ఎపిఐ-ఆధారిత డిజిటల్ వర్క్‌ఫ్లో ద్వారా వితరణ చేస్తుంది.
ఎన్‌ఇఎస్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ దేబజ్యోతి రే చౌధరి మాట్లాడుతూ, ‘‘ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ లేదా ఇబిజి బ్యాంక్ గ్యారెంటీతో భాగస్వామ్యం పొందిన భౌతిక దాఖలీకరణను నివారిస్తుంది. ఇబిజి లబ్ధిదారులకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో ఇబిజి జారీ చేసేందుకు భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎన్‌ఇఎస్‌ఎల్ కాగిత రహిత ఇ-స్టాంపింగ్ డిడిఇ ప్లాట్ఫారం వినియోగించుకునే మొదటి బ్యాంకుగా నిలిచింది’’ అని తెలిపారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నిర్వహణ, నిర్మాణానికి డిజిటల్ ఫ్యాక్టరీ, ఎంటర్ప్రైజ్ ఫ్యాక్టరీ, ఎంటర్ప్రైజ్ ఐటీతో కొత్త సామర్థ్యాలను నిర్మిస్తోంది. కొత్త సామర్థ్యాల నిర్మాణం బ్యాంకు డిజిటల్ కార్యాచరణకు ప్రముఖ స్తంభంగా ఉంది.