Authorization
Tue May 06, 2025 12:01:47 am
- రాజస్థాన్‌లో మూడు సోలార్ ఫార్మ్‌లు, 23 కొత్త రూఫ్‌టాప్ ప్రాజెక్టుల
న్యూఢిల్లీ: భారతదేశంలో అమెజాన్ నేడు తన మొదటి యుటిలిటీ-స్కేల్ రెన్యువబల్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రకటించి, రాజస్థాన్‌లో మూడు సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించింది. వీటిలో 210 మెగావాట్ ప్రాజెక్టులను భారతదేశంలోని డెవలపర్ రిన్యూ పవర్ అభివృద్ధి చేస్తుండగా, 100 మెగావాట్ పథకాన్ని స్థానిక డెవలపర్ యాంప్ ఎనర్జీ ఇండియా అభివృద్ధి చేయనుంది. 110 మెగా వాట్ పథకాన్ని బ్రూక్‌ఫీల్డ్ రెన్యువబుల్ అభివృద్ధి చేయనుంది. సంయుక్తంగా ఈ సౌర విద్యుత్తు ఉత్పాదన కేంద్రాలు ఏడాదికి 1,076,000 మెగావాట్ గంటల (MWh) మేర రెన్యువబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండగా, ఇది న్యూఢిల్లీలో సాధారణ- పరిమాణంలో ఉండే 3 లక్షల 60 వేల కుటుంబాల వార్షిక వినియోగానికి సమానంగా ఉంటుంది. రాజస్థాన్‌లో అమెజాన్ సోలారు ప్రాజెక్టులు భారతదేశంలో రెన్యువబుల్ ఎనర్జీ లభ్యత, అందుబాటులోకి తీసుకు రావడాన్ని మెరుగుపరచేందుకు సహకరిస్తుండగా, కొత్త సామర్థ్యాన్ని నేడు గ్రిడ్‌లో అందుబాటులో ఉండే దానితో పాటు, దాని వెలుపలా కొత్త సామర్థ్యాన్ని సాధ్యం చేయనుంది. అదనంగా అమెజాన్ 23 కొత్తగా రూఫ్ టాప్ సోలారు ప్రాజక్టులను భారతదేశంలోని 14 నగరాల ఫుల్ఫిల్మెంట్ సెంటర్లపై ప్రకటించింది. ఇది భారతదేశంలో మొత్తం 41 పథకాలను తీసుకురాగా, 19.7 మెగా వాట్ రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని తీసుకురాగా, ఇది భారతదేశంలో అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ నెట్‌వర్క్‌కు మద్దతు ఇవ్వనుంది.
‘‘మా కార్యాలయాలకు విద్యుత్తును అందించేందుకు మేము కొత్తగా పవన, సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులను మా ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, డేటా సెంటర్లు, స్టోర్లలో అందుబాటులోకి తీసుకు వస్తుండగా, అవి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది వినియోగదారులకు సేవలు అందించనున్నాయి. 2025 నాటికి మా మొత్తం లావాదేవీల్లో 100% మేర రెన్యువబుల్ ఎనర్జీని వినియోగించుకునే దారిలో ఉన్నాము’’ అని అమెజాన్ వెబ్ సర్వీసెస్ సీఈఓ ఆడం సెలిప్స్కి తెలిపారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు క్లీన్ ఎనర్జీని ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మావంటి సంస్థలు కొనసాగిస్తున్న పెట్టుబడులు వారి ప్రయాణానికి వేగాన్ని అందించేందుకు సహకరిస్తున్నాయి. ఎందుకంటే, పర్యావరణ మార్పులతో ఎదురయ్యే సమస్యలను అడ్డుకునేందుకు మేము కలిసి కట్టుగా శ్రమిస్తున్నాము’’ అని వివరించారు.
‘‘గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ ప్రభుత్వ విధానాల్లోని సంస్కరణలు వ్యాపారం నుంచి రెన్యువబుల్ ఎనర్జీ వైపు మారడం ద్వారా వారి సుస్థిరత లక్ష్యాలను సాధించేందుకు సహకారాన్ని ఇవ్వడాన్ని కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది’’ అని నూతన, రెన్యువబుల్ ఎనర్జీ (MNRE) మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి దినేశ్ దయానంద్ జగదాళె తెలిపారు. ‘‘అమెజాన్ వంటి రెన్యువబుల్ ఎనర్జీ కార్పేరేట్ సంస్థలు భారతదేశ వ్యాప్తంగా రెన్యువబుల్ ఎనర్జీ విభాగంలో పెట్టుబడులకు మూలాలుగా ఉన్నారు. నేడు ప్రకటించిన భారీ స్థాయి ప్రమాణంలోని పథకాలు ఈ పెట్టుబడులు కొత్త రెన్యువబుల్ ఎనర్జీ నుంచి గ్రిడ్‌కు అపార ప్రమాణంలో ఆఫర్ ఇవ్వడం ద్వారా భారతీయ వినియోగదారులకు అన్ని అనుకూలతలను కల్పిస్తాయి. దీన్ని సాధ్యం చేసేందుకు మేము చేసిన విధాన మార్పులు గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు వారి మార్పులకు వేగాన్ని నింపేందుకు కార్పొరేట్ రెన్యువబుల్ ఎనర్జీ పెట్టుబడులను తీసుకురావడంలో ప్రపంచ దేశాలకు మాదిరిగా ఉండే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.
అమెజాన్ రిన్యూ పవర్ ప్రాజెక్టులు రాజస్థాన్‌లో 210 మెగా వాట్ సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో భారతదేశపు సాంకేతిక కంపెనీ అత్యంత పెద్ద కార్పొరేట్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (PPA)[2]గా పరిగణించారు. భారతదేశంలో అభివృద్ధి చేస్తున్న రిన్యూ పవర్‌కు అత్యంత పెద్ద బిజినెస్-టు-బిజినెస్ (B2B) ప్రాజెక్టుగా ఉంది. ‘‘భారతదేశం చరిత్రాత్మక గ్రీన్ ఎనర్జీ మార్పుకు మేము మద్దతు ఇస్తున్నట్లే అమెజాన్ వంటి గ్లోబల్ లీడర్లతో మా పని కార్పొరేట్ వలయం, ఆర్థిక వ్యవస్థలో కర్బన ఉద్గారాలను తగ్గించడం అత్యవసరంగా ఉంది. అమెజాన్ వంటి అగ్రగామి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇతర కంపెనీలకు గ్రీన్ ఎనర్జీని మూలాలను అలవర్చుకోవడం, శక్తి మార్పుకు వేగాన్ని నింపడంలో ఉదాహరణగా ఉండగా, ఇది నెట్-జీరో లక్ష్యాలను చేరుకునేందుకు అత్యంత అవసరంగా ఉంది’’ అని రిన్యూ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, సీఈఓ సుమంత్ సిన్హా తెలిపారు.
‘‘మేము అమెజాన్‌తో ఈ మహోన్నత ప్రాజెక్టులకు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాము. ఇది 100% రెన్యువబుల్ ఎనర్జీని చేరుకునేందుకు కార్పొరేట్లకు పరిహారాలను అందించే యాంప్ ఎనర్జీ ఇండియా ప్రత్యేక సామర్థ్యాలను చాటి చెబుతోంది. రెన్యువబుల్ ఎనర్జీ వినియోగానికి అమెజాన్ వంటి గ్లోబల్ బ్రాండ్‌తో భాగస్వామ్యానికి సంతోషిస్తున్నాము. ఈ ప్రాజెక్టు రెన్యువబుల్ ఎనర్జీ నుంచి డిజిటల్లీ సాధికారత కలిగిన భారతదేశాన్ని మార్చదగిన ప్రభుత్వ డిజిటల్ ఇండియా మిషన్‌కు కూడా మద్దతు ఇస్తుంది’’ అని యాంప్ ఎనర్జీ ఇండియా ఎండి, సీఈఓ పినాకి భట్టాచార్య తెలిపారు.
అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా బ్రూక్‌ఫీల్డ్‌తో 500 మెగా వాట్ కన్నా ఎక్కువ రెన్యువబుల్ ఎనర్జీ పీపీఏలను జారీ చేస్తోంది మరియు భారతదేశంలో కొత్తగా 110 మెగా వాట్ ఉత్పత్తికి చేసుకున్న ఈ ఒప్పందం గురించి బ్రూక్‌ఫీల్డ్‌లో రెన్యువబుల్ పవర్ అండ్ ట్రాన్స్మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ నవల్ సైని మాట్లాడుతూ, ‘‘అమెజాన్‌తో 100% రెన్యువబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న వారి ప్రయాణంలో కలిసి పని చేసేందుకు చాలా సంతోషిస్తున్నాము. కొత్తగా బికనేర్ సోలారు పార్క్ అభివృద్ధిని బ్రూక్‌ఫీల్డ్ గ్లోబల్ ట్రాన్సిషన్ ఫండ్‌లో భాగంగా చేపట్టగా ఇది జీరో కర్బన ఉద్గారాల ఆర్థిక వ్యవస్థ వైపు ప్రపంచాన్ని మార్చేందుకు వేగాన్ని నింపేందుకు ప్రాధాన్యత ఇచ్చే మా ప్రారంభిక ఇంప్యాక్ట్ ఫండ్‌గా ఉంది. సుస్థిరత మరియు కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలకు వేగాన్ని అందించేందుకు ప్రభుత్వాలు, కార్పొరేట్లతో భాగస్వామ్యాన్ని నిరీక్షిస్తున్నాము’’ అని తెలిపారు.
‘‘అమెజాన్‌లో మేము ప్రభుత్వం మరియు వ్యాపారంలో భాగస్వాములతో భారతదేశంలో రెన్యువబుల్ ఎనర్జీ కార్పొరేట్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు తీవ్రంగా శ్రమిస్తున్నాము’’ అని అభినవ్ సింగ్, డైరెక్టర్, కస్టమర్ ఫిల్మెంట్, సప్లై చైన్, అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్, అమెజాన్ ఇండియా. ‘‘పిపిఏలు మాత్రమే కాకుండా డెవలపర్లు, కొనుగోలుదారులు తమ అనుకూలతలకు అనుగుణంగా ఒప్పందాలను చేసుకోవచ్చు. వ్యాపార సమూహాలతో ప్రభుత్వ చర్యలకు అనుకూలత కల్పించవచ్చు మరియు కొత్తగా వినియోగదారులను చేరుకోవాలని కోరుకుంటున్న స్థానిక విద్యుత్తు సరఫరాదారులను చేరేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. అమెజాన్ కార్పొరేట్ రెన్యువబుల్ ఎనర్జీ పొందే ఎంపికలను విస్తరించే దిశలో సహకరించేందుకు కట్టుబడి ఉండగా, భారతదేశంలోని పలు ప్రాంతాలకు పర్యావరణనాకి సంబంధించిన, హరిత ఉద్యోగాలు మరియు పెట్టుబడులను తీసుకు వస్తుంది’’ అని తెలిపారు.
అమెజానర్ తన రెన్యువబుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో ప్రపంచ విస్తరణను కూడా ప్రకటించగా, 71 నూతన రెన్యువబుల్ ఎనర్జీ పథకాల్లో 2.7 గిగావాట్ల (GW) మేర అదనపు క్లీన్ ఎనర్జీ పథకాలను తీసుకు వచ్చింది. ఇందులో దక్షిణ అమెరికాలో కంపెనీ మొదటి రెన్యువబుల్ ఎనర్జీ పథకాన్ని ప్రారంభించగా, ఇది బ్రెజిల్లో ఉంది మరియు పోలాండ్‌లో తన మొదటి సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించింది. కార్యాచరణ ప్రారంభించిన తర్వాత అమెజాన్ రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యం 50,000 గిగా వ్యాట్ గంటల (GWh) మేర క్లీన్ ఎనర్జీ లేదా ఏడాదికి 13 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలకు శక్తి అందించే మేర విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా రెన్యువబుల్ ఎనర్జీని అత్యంత పెద్ద కొనుగోలుదారుగా అమెజాన్ ఇప్పుడు 21 దేశాల్లో 379 రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను కలిగి ఉండగా, అందులో 154 పవన, సౌర విద్యుత్తు ఉత్పత్తి విభాగాలు, 225 చోట్ల పైకప్పులపై సౌర విద్యుత్తు ఉత్పత్తి ఫలకాలు ఉండగా, 18.5 గిగా వాట్ రెన్యువబుల్ శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కంపెనీ ఇప్పుడు మొత్తం 57 రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను కలిగి ఉంది. కంపెనీ 2021 చివరినాటికి తన లావాదేవీల్లో 85% మేర రెన్యువబుల్ ఎనర్జీని చేరుకుంది.