Authorization
Wed May 07, 2025 09:06:06 am
ముంబయి: అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ పతనం కొన సాగుతూనే ఉంది. వరుసగా నాలుగో సెష న్‌లోనూ క్షీణించింది. సోమవారం ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని చవి చూసింది. తుదకు 58 పైసలు పతనమై రూ.81.67 వద్ద నమోదయ్యింది. శుక్రవారం ట్రేడింగ్‌లో రూ.81.09 వద్ద ముగిసింది. గత నాలుగు సెషన్లలో రూపాయి 193 పైసలు మేర పతనమైంది. అతి త్వరలోనే డాలర్‌తో రూపాయి 82కు పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచడంతో స్టాక్ మార్కెట్లతో పాటు రూపాయి పతనం అవుతోంది. ఈ పరిణామం ఇప్పటికే మంద గించిన ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్ర ప్రతికూలతలను పెంచనుంది.