Authorization
Tue May 06, 2025 04:42:57 am
హైదరాబాద్ : క్లియర్‌ట్రిప్ పండగ సీజన్‌ను పురస్కరించుకుని అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ 'ద బిగ్ బిలియన్ డేస్' కార్యక్రమానికి అనుగుణంగా దేశీయ, అం తర్జాతీయ విమానాలు, దేశీయ హోటల్స్‌పై పలు రాయితీలు కల్పిస్తున్న ట్లు పేర్కొంది. ఇందులో భాగంగా పలు అంతర్జాతీయ రూట్లలో రూ. 6,999 కు, దేశీయంగా రూ.999కే టికెట్లను పొందవచ్చని తెలిపింది. హోటల్ గదుల బుకింగ్లోనూ భారీ రాయితీలు కల్పిస్తోంది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 30 వరకూ తమ సైట్లో లభ్యమవుతాయని తెలిపింది.