Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పైసాబజార్, వినియోగదారు క్రెడిట్‌కు ఇండియాలో అతి పెద్ద డిజిటల్ మార్కెట్‌ప్లేస్ మరియు ఉచిత క్రెడిట్ స్కోర్ ప్లాట్‌ఫామ్, గత 6 సంవత్సరాలకు మించిన కాలంలో తమ ప్లాట్‌ఫామ్‌పై 3 కోట్లకు పైగా వినియోగదారులు తమ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకున్నారని ప్రకటించింది. దేశంలోని అన్ని నాలుగు క్రెడిట్ బ్యూరోలతో భాగస్వామ్యం ద్వారా ఉచితంగా జీవిత కాలం పాటు, వినియోగదారులు తమ క్రెడిట్ స్కోర్ మరియు రిపోర్ట్‌లను ట్రాక్ చేసుకునేందుకు పైసాబజార్ అవకాశం కల్పిస్తుంది.
గత 6 సంవత్సరాలుగా కొనసాగుతున్న బ్రాండ్ పెట్టుబడులతో పాటు క్రెడిట్ స్కోర్ పొందడాన్ని యాక్సెస్ చేసే సౌలభ్యం, మరియు పరిశ్రమలో మొదటిసారిగా చేపట్టిన అనేక చర్యల ఫలితంగా, వినియోగదారులు తమ ఉచిత క్రెడిట్ స్కోర్ కోసం పైసాబజార్‌లో వివిధ విభాగాలను సందర్శిస్తున్నారు. నవీన్ కుక్రేజా, సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు, పైసాబజార్, మాట్లాడుతూ, “ఇండియాలో అధికారిక రుణ వ్యాప్తి తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఆర్థిక అక్షరాస్యత పేలవంగా ఉండడం, అలాగే దీనిపై క్రెడిట్ అవగాహన లేకపోవడం. మార్కెట్ లీడర్‌గా, వినియోగదారులు తమ రుణ ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి, నిర్మించుకోవడానికి మరియు అత్యంత అనుకూలమైన ఆఫర్లకు యాక్సెస్‌ను అందించడం ద్వారా క్రెడిట్ అవగాహనను మరింతగా పెంచేందుకు మేము నిరంతర ప్రయత్నం చేస్తున్నాము,” అన్నారు. నేటి వరకు, పైసాబజార్‌లో 823 నగరాలు మరియు పట్టణాల నుంచి వినియోగదారులు తమ ఉచిత క్రెడిట్ స్కోర్‌ను యాక్సెస్ చేశారు. పైసాబజాజర్లో వినియోగదారు ట్రెండ్ల ప్రకారం గత కొన్నేళ్లుగా, దేశవ్యాప్తంగా వినియోగదారులలో క్రెడిట్ అవగాహన స్పష్టంగా పెరిగింది, ప్రధాన మెట్రోలకు (అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, మరియు పూనే) వెలుపల ఉండే 67 శాతం వినియోగదారులు పైసాబజార్‌లో తమ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.37 శాతం వినియోగదారులు 3వ శ్రేణి నగరాలు మరియు పట్టణాల నుంచి ఉన్నారు. పైసాబజార్ యొక్క ఉచిత క్రెడిట్ స్కోర్ చొరవ ప్రారంభించిన తొలి ఏడాదిలో, కేవలం 34 శాతం మంది వినియోగదారులు మాత్రమే మెట్రోయేతర నగరాల నుంచి ఉన్నారు, ఇవాళ తొలిసారిగా పైసాబజార్‌లో తమ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేసుకునేవారిలో 75 శాతం మంది కొత్త వినియోగదారులు, ప్రధాన మెట్రోలకు వెలుపల నుంచే ఉంటున్నారు. ఇండియాలో క్రెడిట్ స్కోర్‌పై అవగాహన పెంచడం కోసం, పైసాబజార్ గత కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లీష్, హిందీలలో మాత్రమే కాకుండా మరాఠీ, కన్నడ మరియు తెలుగు వంటి ప్రాంతీయ భాషలలో ఉచిత క్రెడిట్ రిపోర్ట్‌ను అందిస్తోంది. కస్టమర్లు ప్రతి నెలా అన్ని భాషల్లో వారి ఉచిత రిపోర్ట్‌ను ఉచితంగా యాక్సెస్ పొందుతారు. రాధికా బినాని, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, పైసాబజార్, మాట్లాడుతూ, “మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి యాక్సెస్‌ను సులభతరం చేయడం ద్వారా, దేశంలో క్రెడిట్ అవగాహనను పెంపొందించడం కోసం, ము చిన్న పాత్ర పోషించడానికి కృషి చేస్తున్నాము, మేము ఆయా విభాగాలను వర్గీకరణపై కూడా తీవ్రంగా దృష్టి సారించాము, అలాగే సన్నిహితంగా కృషి చేస్తున్నాము. ప్రతి విభాగం యొక్క అవసరం మరియు అర్హత ప్రకారం, మా భాగస్వాములు కస్టమర్లకు అనుకూలమైన తగిన రుణ పరిష్కారాలను అందిస్తున్నారు,” అని తెలిపారు.
ఒక నెలలో 1,000 నగరాలు, పట్టణాలకు చెందిన వివిధ వినియోగదారుల విభాగాల నుండి రుణ ఉత్పత్తుల కోసం 17 కోట్లకు పైగా ఎంక్వైరీలను పైసాబజార్ అందుకుంటుంది. ఎంపిక ప్రకారం, వారి క్రెడిట్ స్కోర్, ఆదాయం, భౌగోళిక ప్రాంతం మరియు ఇతర కీలక పారామితులను లోతుగా వర్గీకరించడం ద్వారా ఆధారంగా వారికి అనుకూలమైన రుణ పరిష్కారాలను అందించడానికి పైసాబజార్ ప్రయత్నిస్తోంది.
సూపర్-ప్రైమ్ మరియు ప్రైమ్ వినియోగదారు విభాగాలలో ఉండేవారు, అనేక బ్యాంకులు మరియు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రూపొందించిన ప్రీ-అప్రూవ్డ్ ప్రోగ్రామ్‌ల ద్వారా రుణాలకు, ఇబ్బందులు లేని యాక్సెస్‌ను పొందుతారు, అదే సమయంలో, క్రెడిట్ స్కోర్ పాడయిన వారికి క్రెడిట్ మెరుగుదల సేవలను పైసాబజార్ అందిస్తుంది. రుణాలను కొత్తగా తీసుకునేవారి నుంచి సబ్-ప్రైమ్ విభాగాల కోసం, ప్రత్యేకమైన క్రెడిట్ నిర్మాణ ఉత్పత్తి, స్టెప్ అప్ క్రెడిట్ కార్డ్‌ను కూడా సహ భాగస్వామ్యంతో పైసాబజార్ రూపొందించింది.