Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : లార్డ్స్ మార్క్ ఇండిస్టీస్ ఆరోగ్య సంరక్షణ విభాగం లార్డ్స్ మెడ్ కొత్తగా ముంబయిలో రోగ నిర్థారణ పరీక్షలకు సంబంధించిన ఐవిడి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. దీన్ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్థి చేసినట్లు తెలిపింది. ఇక్కడ విస్తతశ్రేణిలో ఐవిడిలను తయారు చేయడంతో పాటుగా పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నోస్టిక్ పరిష్కారాలను కూడా అందించనున్నట్లు పేర్కొంది. దీని అభివృద్థికి మరో రూ.33 కోట్ల వ్యయం చేయనున్నామని.. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది.