Authorization
Wed May 07, 2025 09:16:40 am
· రైతుల స్ఫూర్తిని పెంపొందించడాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ప్రచారం ప్రారంభం
· ఫౌండేషన్ రాబోయే మూడేండ్లలో 1 లక్ష మంది రైతులపై ప్రభావం చూపాలని లక్ష్యంగా పెట్టుకుంది
· ప్రచారచిత్రానికి లింక్: https://www.youtube.com/watch?v=ZufI9eccCgM
ముంబై, 10 అక్టోబరు, 2022: మారికో పారాచూట్ కల్పవృక్ష ఫౌండేషన్ (PKF) FY2026 నాటికి రూ. 1000 కోట్ల వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం ద్వారా 1 లక్ష మంది రైతులను ప్రభావితం చేయాలనే లక్ష్యాన్ని ధృవీకరించడానికి ఒక కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం భారతదేశంలోని వ్యవసాయ కమ్యూనిటీలకు వారి సహజసిద్ధమైన వృద్ది మరియు ప్రోత్సాహాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా నివాళులు అర్పిస్తుంది. మారికో భారతీయ రైతుల స్ఫూర్తిదాయకమైన కథలను దేశ ప్రజల ముందుకు తీసుకురావాలని ఆకాంక్షిస్తుంది.
ప్రచారంలో భాగంగా, పారాచూట్ కల్పవృక్ష ఫౌండేషన్ మన రైతుల ప్రోత్సాహ స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకోవడానికి మరియు వారి నిరంతర ప్రయత్నాలను అభినందించడానికి ఒక చిత్రాన్ని ప్రారంభించింది. భారతీయ వ్యవసాయ సంఘంతో మారికో అనుబంధాన్ని మరియు రైతులు తమ దిగుబడిని మెరుగుపరచుకోవడానికి PKF ఎలా సహాయం చేస్తుందో కూడా ఈ చిత్రం వివరిస్తుంది. ప్రగతిశీల వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న రైతులను సన్నద్ధం చేయడం మరియు వారికి మద్దతు ఇవ్వడం అలాగే వారికి అధిక నాణ్యత గల జీవనాన్ని అందించడం అనేది ప్రచారం ప్రధాన ఆలోచన. ఈ విధంగా, టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా PKFతో కనెక్ట్ అవ్వమని ఈ చిత్రం రైతులను ఆహ్వానిస్తుంది.
PKF వివిధ ప్రాంతాలలో అనేక శిక్షణా సమావేశాలను విజయవంతంగా నిర్వహించింది. రైతులకు శాస్త్రీయ మరియు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తుంది. సాంకేతిక ఆవిష్కరణలతో సంప్రదాయ వ్యవసాయాన్ని పెంచింది. మారికో, PKF ద్వారా ఈ కార్యక్రమాన్ని అత్యంత వేగంతో విస్తరించడం కోసం వ్యవసాయ వ్యాపారవేత్తలను నియమించడం వంటి ఇతర మోడళ్ళపై పని చేస్తుంది. 'పారాచూట్ కల్పవృక్ష ఫౌండేషన్', రైతుల ఆదాయం మరియు జీవన ప్రమాణాలపై సానుకూల ప్రభావాన్ని సృష్టించేందుకు కృషి చేస్తుంది. ప్రస్తుతం కేరళ మరియు తమిళనాడుపై దృష్టి సారించింది, PKF రైతుల కోసం వారి ఉత్పాదకతను పెంచడానికి 24,135 డిజిటల్ ఎనేబుల్డ్ శిక్షణలను నిర్వహించింది.
పారాచూట్ కల్పవృక్ష ఫౌండేషన్ విజయం గురించి మాట్లాడుతూ, మిస్టర్ అమిత్ భాసిన్, చీఫ్ లీగల్ ఆఫీసర్ & గ్రూప్ జనరల్ కౌన్సెల్ మరియు సెక్రటరీ, CSR కమిటీ, మారికో లిమిటెడ్, ఇలా అన్నారు. "విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఆవిష్కరణల ద్వారా సమాజాన్ని పెంపొందించడం మరియు సాధికారత కల్పించడం ద్వారా సమాజాన్ని సానుకూలంగా ప్రభావితం చేయాలని మేము నిశ్చయించుకున్నాము కాబట్టి సుస్థిరత అనేది మారికో యొక్క నీతిలో ఎల్లప్పుడూ విడదీయరాని భాగం. ఈ ప్రచారంతో, మా వ్యవసాయ సంఘం యొక్క అవిశ్రాంత ప్రయత్నాలను హైలైట్ చేయడం మరియు వినియోగదారులకు వారితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో సహాయం చేయడం మా లక్ష్యం. గత కొన్నేండ్లుగా సానుకూల ప్రభావం చూపి 2026 నాటికి 1 లక్ష మంది రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
శాశ్వత మార్పు కోసం కట్టుబడి ఉన్న మారికో లిమిటెడ్, 2017లో పారాచూట్ కల్పవృక్ష ఫౌండేషన్‌ను ప్రారంభించింది. ప్రారంభమైనప్పటి నుండి, PKF 2.55 లక్షల ఎకరాలకు పైగా విస్తరించింది మరియు 62,900 మంది రైతులను ఈ కార్యక్రమంలో చేర్చుకుంది. రైతులకు సరైన శిక్షణ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం ద్వారా వారి సంక్షేమం కోసం కృషి చేయాలని ఫౌండేషన్ ఆకాంక్షిస్తుంది. ఈ ప్రోగ్రామ్ గత మూడు సంవత్సరాలలో 15% y-o-y ఉత్పాదకతను పెంచింది. FY25 నాటికి, ఉత్పాదకతలో 16% వృద్ది సాధించడానికి 4 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని మరియు 1 లక్ష మంది రైతులను నమోదు చేయాలని మారికో లక్ష్యంగా పెట్టుకుంది.