Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికం (క్యూ2)లో బీఓఎం లాభాలు రెట్టింపై రూ.535 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.264 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో రూ.4,039 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన క్యూ3లో రూ.4,317 కోట్లకు చేరిందని ఆ బ్యాంక్ సోమవారం రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 5.56 శాతం నుంచి 3.40 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో 1.73 శాతంగా ఉన్న నికర ఎన్‌పిఎలు.. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో 0.68 శాతానికి పరిమితం కావడం విశేషం.