Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో ఇటీవలి కాలంలో మహిళలు వృత్తి రంగాల్లో రాణిస్తున్నారు. కార్పోరేట్ కార్యాలయాల్లో బోర్డ్ రూమ్ల్లోనూ వారు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు కానీ స్వతంత్య్రంగా ఆర్ధిక నిర్ణయాలను తీసుకోవడం దగ్గరకు వచ్చేసరికి ఇంకా వెనుకబడే ఉన్నారని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ (టాటా ఏఐఏ) ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎమాంగ్ ఉమెన్ (మహిళల నడుమ ఆర్థిక అవగాహన) అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం అధికశాతం ఇప్పటికీ మ్యాన్ ఆఫ్ ద హౌస్ (ఇంటి యజమాని)పై ఆధారపడుతున్నారు. అయితే తమకు అవకాశం వస్తే నిర్ణయాలు తీసుకుంటామని 44 % మంది వెల్లడిస్తున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయన ఫలితాలను గురించి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గిరీష్ కల్రా మాట్లాడుతూ ‘‘మా వినియోగదారులను అర్ధం చేసుకోవడమనేది మా వినియోగదారులకు విలువనందించడంలో అత్యంత కీలకమైన అంశం. ఆర్థిక ప్రణాళిక దగ్గరకు వచ్చేసరికి మహిళలు అత్యంత కీలకం. అయినప్పటికీ తమ ప్రాధాన్యతల పట్ల వారికి అతి తక్కువ అవగాహన ఉంది. టాటా ఏఐఏ వద్ద ఈ అధ్యయనం నుంచి మేము తెలుసుకున్న అంశాలతో మహిళలే లక్ష్యంగా పరిష్కారాలను రూపొందించనున్నాము’’ అని అన్నారు. ఈ అధ్యయనాన్ని భారతదేశ వ్యాప్తంగా 18 నగరాల్లో 25–55 సంవత్సరాల వయసులోని 1000 మంది స్పందన దారులతో నిర్వహించారు.