Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న మరుసటి రోజునే ఆ సంస్థ సిఇఒ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సీగల్, లీగల్ పాలసీ ట్రస్ట్ లీడ్ విజయ గడ్డె సహా పలువురిని తొలగించిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇప్పుడు మిగిలిన సిబ్బందిపైనా వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కంపెనీలో పనిచేస్తున్న 7,500 మంది ఉద్యోగులలో సుమారు 75 శాతం మందిని నవంబరు 1వ తేదీ లోగా తొలగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలిస్తోంది. ట్విట్టర్ సిఇఒగా ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థలకు అధినేతగా మస్క్ వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్ ప్రస్తుత మేనేజ్మెంట్ 2023 చివరి నాటికి కంపెనీ పేరోల్ (వేతనాల మొత్తం)ను సుమారు 800 మిలియన్ డాలర్లకు తగ్గించాలని అనుకుంటున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పోస్ట్ తాజా నివేదికలు వెల్లడించాయి. అంటే దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్యోగులను ఇంటికి పంపించనుంది.