Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీక్యాస్ట్ కాంక్రీట్ డిజైన్లోకి ప్రవేశం
హైదరాబాద్ : ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ గడిచిన జులై నుంచి సెప్టెంబర్‌తో త్రైమాసికంలో 87 శాతం వృద్ధితో రూ.6.85 కోట్ల నికర లాభాలు సాధించింది. పన్నుకు ముందు లాభం 146 శాతం దూసుకెళ్లి రూ.9.4 కోట్లకు చేరింది. ఎబిటా 68 శాతం ఎగిసి రూ.10.5 కోట్లుగా నమోదయ్యింది. టర్నోవర్ 48 శాతం అధికమై రూ.35 కోట్లుగా నమోదు చేసింది. టర్నోవర్ స్ట్రక్చరల్ డివిజన్ 26 శాతం, మెకానికల్ విభాగం 59 శాతం పెరిగినట్లు ఆ కంపెనీ తెలిపింది. ప్రీక్యాస్ట్ కాంక్రీట్ డిజైన్ సేవల్లోకి ప్రవేశించినట్టు మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ సిఎండి జె.లక్ష్మణ రావు తెలిపారు. యుఎస్, యూరప్‌లో ఐటి, ఇంజనీరింగ్ స్టాఫింగ్ విభాగంలోకి ప్రవేశించనున్నట్లు పేర్కొన్నారు.