Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలోని టాప్ 5 విక్రేతలలో ఈ ఏడాది 3వ త్రైమాసికంలో (Q3) ఏడాది నుంచి ఏడాదితో పోల్చితే (Y-O-Y) 14% వృద్ధితో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విక్రేతగా ఒప్పో అవతరించింది.
ఇండియా : గ్లోబల్ స్మార్ట్ డివైజ్ బ్రాండ్ ఒప్పో, కెనాలిస్ ద్వారా 2022 Q3 షిప్మెంట్ నివేదిక ప్రకారం, ఏడాది నుంచి ఏడాదికి (Y-O-Y) భారతదేశంలోని మొదటి ఐదు విక్రేతలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా ఉద్భవించింది. ఒప్పో ఇండియా 2022 మూడో త్రైమాసికంలో (Q3) ఏడాది నుంచి ఏడాదికి పోల్చితే 14 శాతం వృద్ధి మరియు 7.1 మిలియన్ షిప్మెంట్లతో ఏడాది మొత్తం స్థిరమైన వృద్ధి వేగాన్ని ప్రదర్శించింది.
పలు ఏండ్లుగా, భారతదేశం ధరల విభాగాల్లో అత్యుత్తమమైన సాంకేతికతను కలిగి ఉన్న పరికరాలతో బలమైన పోర్ట్‌ఫోలియోను ఒప్పో విడుదల చేసింది. రెనో8 ప్రో 5జి మరియు రెనో8 5జిలకు లభించిన అసాధారణమైన ప్రతిస్పందన దీనికి నిదర్శనం. ఇవి విక్రయాల మొదటి మూడు రోజుల్లోనే వరుసగా 105% మరియు 124% లక్ష్యాన్ని సాధించాయి. ఇంకా, సరసమైన ధరలో ప్రీమియం అనుభవాన్ని అందించే ఎఫ్ సిరీస్ మిలీనియల్స్‌లో ఫ్యాన్స్‌కు ఇష్టమైన పరికరంగా నిలిచింది. అలాగే 2022లో ఎఫ్21 ప్రో ద్వారా 68% వృద్ధిని సాధించింది. అత్యుత్తమ సాంకేతికతను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, ఒప్పో తన కె సిరీస్‌తో దేశవ్యాప్తంగా వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది మరియు దేశంలో అత్యంత ఇష్టపడే 5జి పరికరాలలో ఒకటిగా కె10 ఇప్పుడు 5జి పరికరంగా అందుబాటులోకి వచ్చింది.
వినియోగదారులకు కచ్చితమైన స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తామనే వాగ్దానంతో, ఒప్పో ఇండియా భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన వెంటనే 5జి సాంకేతికతను తన వినియోగదారులందరికీ అందించేలా చర్యలు తీసుకుంది. స్వతంత్ర నెట్‌వర్క్‌లో 5జికి మద్దతు ఇచ్చే వివిధ విభాగాలలో 5జి పరికరాలకు బలమైన పర్యావరణ వ్యవస్థను బ్రాండ్ నిర్మించింది. ఒప్పో ఇండియా సెప్టెంబర్ 2022 ప్రారంభం నుంచి స్వతంత్ర నెట్‌వర్క్‌కు మద్దతు ఇచ్చేందుకు ఎఫ్21 ప్రో 5జి మరియు కె10 5జి పరికరాలను అప్డేట్ చేయడం ప్రారంభించింది మరియు 5జి రోల్‌అవుట్‌కు అనుగుణంగా ఓటీఏ అప్డేట్ను పూర్తి చేసింది.
ఈ మైలురాయికి చేరుకోవడంపై ఒప్పో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమ్యంత్ సింగ్ ఖనోరియా మాట్లాడుతూ, ‘‘ఇన్స్పిరేషన్ ఎహెడ్ అనే మా బ్రాండ్ ప్రతిపాదనకు అనుగుణంగా, ఒప్పోలో మేము స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలలో గర్వించదగిన ఆవిష్కరణలు చేస్తూ ముందుకు సాగుతున్నాము. మేము ఒక ఉత్పత్తితో వారి జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చే పర్యావరణ వ్యవస్థ ద్వారా మా వినియోగదారులతో మా అనుబంధాన్ని విస్తరించుకున్నాము. మేము ఏడాది నుంచి ఏడాదికి (Y-O-Y) స్థిరమైన వృద్ధితో మా వినియోగదారులకు ఒప్పో తన ఉత్పత్తుల ద్వారా ఏమి అందిస్తుందో తెలియజేశాము. మేము భారతీయ మార్కెట్ కోసం అత్యాధునిక పరికరాలను రూపొందించేందుకు సాంకేతికత మరియు ఆవిష్కరణలలో సరిహద్దులను విస్తరించుకుంటూ వెళుతున్నాము’’ అని వివరించారు.
గ్రేటర్ నోయిడాలో బలమైన ఉత్పాదక యూనిట్ మద్దతుతో, ఒప్పో ఇండియా 2022లో వరుసగా రెండు త్రైమాసికాల పాటు మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తి షిప్మెంట్లలో అగ్రగామిగా నిలిచానని ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటించిన ‘‘ఆత్మనిర్భర్ భారత్’’ మిషన్‌కు ఒప్పో గణనీయంగా సహకరించింది. బ్రాండ్ ఎస్ఎంఇలు మరియు ఎంఎస్ఎంఇలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు మరియు క్రమంగా, భారతదేశంలో బలమైన స్మార్ట్‌ఫోన్ పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు స్థానిక సప్లయ్ చైన్‌ను బలోపేతం చేసేందుకు ‘విహాన్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద, ఒప్పో ఇండియా వచ్చే ఐదేండ్లలో 60 మిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.