Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశం యొక్క అగ్రగామి సాధారణ బీమా కంపెనీ అయిన హెచ్డిఎఫ్సి ఎర్గో (HDFC ERGO) జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ , రైతుల కోసం సృజనాత్మక మరియు టెక్నాలజీ వెన్నుదన్నుతో కూడిన పొలం దిగుబడి బీమా పాలసీని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇది తనదైన రకం మొట్టమొదటి బీమా పరిష్కారము, ఇందులో స్థానికం చేయబడిన పొలం స్థాయి వర్తింపును అందజేయడానికై ఉపగ్రహ ఆధారిత సూచిక ఉపయోగించబడుతుంది. ఉపగ్రహ ఆధారిత డేటా ఆధారంగా, అది విత్తనం వేయడం నుండి పంటకోత వరకూ పంట కాలం వ్యాప్తంగా సమగ్రమైన కవరేజీని అందిస్తుంది. ఈ ఉత్పాదన రైతులకు కార్పొరేట్/ వ్యవసాయ పెట్టుబడుల కంపెనీ (FIC) ఒప్పందాల క్రింద లక్ష్యంగా చేసుకోబడింది. నిర్దిష్ట పంట యొక్క చారిత్రాత్మక ఉపగ్రహ ఇమేజింగ్ డేటా మరియు బహిరంగ డొమైన్లో అందుబాటులో ఉన్న ఒక రిమోట్ సెన్సింగ్ పద్ధతిని ఉపయోగించడం ద్వారా ప్రతి పంట దిగుబడి కొరకు ప్రవేశపు సూచిక విలువ లెక్కించబడుతుంది. ఒకవేళ పంట దిగుబడి ఏమైనా నష్టపోయిందా అని నిర్ధారించడానికి గాను, ప్రవేశపు /బెంచ్మార్క్ సూచీ ఆ తర్వాత బీమా చేయబడిన పంట కొరకు సూచిక ఉపగ్రహం ద్వారా లెక్కించబడిన వాస్తవ సూచీ విలువతో పోల్చబడుతుంది. ఇది సంపూర్ణంగా టెక్నాలజీ ఆధారితమైనది అయినందువల్ల, ఈ పంట యొక్క క్లెయిము అంచనా చేయు సందర్భములో మాన్యువల్ సర్వే అవసరం ఉండదు. ప్రారంభాన్ని పురస్కరించుకొని వ్యాఖ్యానిస్తూ,. హితేన్ కొఠారీ, నియమించబడిన యాక్చువరీ, హెచ్డిఎఫ్సి ఎర్గో (HDFC ERGO) జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, ఇలా అన్నారు, “వ్యవసాయాన్ని దెబ్బతీసే అత్యంత ప్రత్యక్ష విపత్తుల మార్గాలలో ఒకటి ఏమిటంటే, పంట దిగుబడి ఆశించనదానికంటే తక్కువగా ఉండటం లేదా గణనీయంగా దెబ్బతినడం ఒకటి. ఇది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థికపరమైన నష్టాలను కలిగిస్తుంది, అది మొత్తం విలువ గొలుసు అంతటా కొనసాగగలుగుతుంది, వ్యవసాయ రంగం యొక్క ఎదుగుదలను లేదా మొత్తం జాతీయ ఆర్థిక స్థితిని సైతమూ దెబ్బతీస్తుంది. ఒక డిజిటల్ ఫస్ట్ సంస్థగా, పొలం దిగుబడి బీమా వర్తింపు అనేది పంటలు అన్నింటికీ పంటసాగు వలయం యొక్క అన్ని దశల వ్యాప్తంగా, కష్టతరమైన మాన్యువల్ సర్వేల అవసరం లేకుండా సమీకృతమైన బీమా వర్తింపును అందజేస్తుంది” అన్నారు.
ఈ పాలసీ ఆహార పంటలు, నూనెగింజల పంటలు మరియు వాణిజ్యపరమైన లేదా పండ్లతోటల కొరకు చెల్లుబాటులో ఉంటుంది.
హెచ్డిఎఫ్సి ఎర్గో (HDFC ERGO) గురించి:
హెచ్డిఎఫ్సి ఎర్గో (HDFC ERGO) జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అనేది, HDFC లిమిటెడ్ మరియు జర్మనీ యొక్క మ్యూనిచ్ RE గ్రూపు యొక్క ప్రాథమిక బీమా ప్రతిపత్తి సంస్థ అయిన ERGO ఇంటర్నేషనల్ AG మధ్యన ఒక ఉమ్మడి వెంచరుగా ఉంది. హెచ్డిఎఫ్సి ఎర్గో (HDFC ERGO) అనేది, భారతదేశములో ప్రైవేటు రంగములోని అతిపెద్ద జీవిత-యేతర బీమా కంపెనీలలో ఒకటిగా ఉంది. ఒక డిజిటల్-ఫస్ట్ కంపెనీ, కృత్రిమ-మేధ ప్రథమ కంపెనీగా పరివర్తన చెందుతూ, హెచ్డిఎఫ్సి ఎర్గో (HDFC ERGO), వినియోగదారులకు అత్యుత్తమ శ్రేణి సర్వీస్ అనుభవాన్ని అందించడానికై సాంకేతికతను అమలు చేయుటలో ఒక అగ్రగామి దిగ్గజంగా ఉంది. ఈ కంపెనీ, కృత్రిమ మేధస్సు (AI), మెషీన్ లెర్నింగ్ (ML), న్యాచురల్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్ (NLP), రోబోటిక్స్, మరియు IBM వాట్సన్ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి సృజనాత్మకమైన మరియు కొత్త ఉత్పత్తులను, అదేవిధంగా సేవలను నెలకొల్పింది. హెచ్డిఎఫ్సి ఎర్గో (HDFC ERGO) సాధారణ బీమా ఉత్పత్తుల శ్రేణిని అందిస్తోంది మరియు ~93% రిటెయిల్ పాలసీలు డిజిటల్ గానే జారీ చేయబడుతుండగా సంపూర్ణమైన డిజిటల్ అమ్మక ప్రక్రియను కలిగి ఉంది. హెచ్డిఎఫ్సి ఎర్గో (HDFC ERGO)చే అభివృద్ధిపరచబడిన స్వయం-సహాయ సాంకేతిక వేదిక, కస్టమర్లు స్వయం-సహాయ రూపములో వర్చువల్ గానే 58% సేవలను 24x7 ప్రాతిపదికన, ~40% మంది కస్టమర్లు డిజిటల్ గా సేవలను కోరుతుండగా అందుబాటు చేసుకోవడానికి సాధికారత కల్పించింది.
కంపెనీ రిటెయిల్ రంగములో ఆరోగ్యం, మోటార్, హోమ్, వ్యవసాయం, ప్రయాణం, క్రెడిట్, సైబర్, మరియు వ్యక్తిగత ప్రమాదముతో సహా సాధారణ బీమా ఉత్పత్తుల యొక్క సంపూర్ణ శ్రేణిని దానితో పాటుగా కార్పొరేట్ రంగములో ప్రాపర్టీ, మెరైన్, ఇంజనీరింగ్, మెరైన్ కార్గో, గ్రూప్ ఆరోగ్యము, మరియు లయబిలిటీ బీమాను అందజేస్తోంది. అవి విశిష్టమైన బీమా ఉత్పత్తులు అయినా, సమీకృతమైన కస్టమర్ సర్వీస్ నమూనాలు అయినా, అగ్రశ్రేణి క్లెయిము ప్రక్రియలు అయినా, లేదా సాంకేతిక పరమైన నవ్య ఆవిష్కరణ పరిష్కారాలకు ఆతిథ్యమిచ్చేదయినా సరే, హెచ్డిఎఫ్సి ఎర్గో (HDFC ERGO), వినియోగదారులకు వాస్తవ సమయములో సేవలు అందించబడేలా చూసుకోవడానికి తన కస్టమర్లను ప్రతి స్పర్శ బిందువు మరియు మైలురాయి వద్ద కూడా ఆనందింపజేయగలుగుతూ ఉంది.