Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియంత్రణకు ప్రభుత్వానికి వివరణిస్తాం:ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణ కట్టడి అంశంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని రిజ ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తి కాంత దాస్ అంగీకరించారు. దీనిపై త్వర లోనే వివరణ ఇస్తూ ప్రభుత్వానికి నివేదిక అం దిస్తామన్నారు. బుధవారం ముంబయిలో జరిగిన ఎఫ్ఐబీఏసీ కాన్ఫరెన్స్ లో బ్యాంకర్లతో దాస్ మాట్లాడారు. వరుసగా మూడు త్రైమాసికా ల్లో రిటై ల్ ద్రవ్యోల్బణం 6శాతానికి ఎగువన ఉండడానికి గల కారణాలపైనే నివే దికలో దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం గురువారం ఆర్బిఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ భేటీ కానుందని వెల్లడించారు. అయితే అందు లోని విషయాలను మాత్రం బయట పెట్ట మని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి దాపరికాలు లేవన్నారు. కానీ.. ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు మధ్య జరిగే సమాచార బదిలీని బహిర్గతం చేసేందుకు నిబంధనలు అంగీకరిం చవన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ఎప్పటి వరకు కట్టడిలోకి వచ్చే అవకా శం ఉందో కూడా ప్రభుత్వానికి తెలుపు తామన్నారు. ధరల్ని అదుపు చేయ డానికి తీసుకునే చర్యల విషయం లో తొందరపడి ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చి ఉండేద న్నారు. ఇప్పటి వరకు ద్రవ్యోల్బణాన్ని నియ ంత్రించడానికి ఆర్బిఐ తీసుకున్న చర్యలు బాగానే ఉన్నాయని దాస్ సమర్థిం చుకున్నారు. దేశంలో ఓ దశలో ధరలు పెరుగుతున్న సమయంలోనూ ..వడ్డీ రేట్లను అలాగే కొనసాగించడం ద్వారానే ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచామన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా ఉంచగలి గామన్నారు. తొందరపడి ఆ సమయంలో వడ్డీ రేట్లు పెంచితే వ్యవస్థలకు నష్టం జరి గేదన్నారు. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య కొనసాగించా లని ఆర్బిఐ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. ఇది ఏడు శాతంగా ఎగువన న మోదవుతుంది. గడిచిన సెప్టెంబర్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూ చీ 7.41 శాతానికి ఎగిసి ఐదు మాసాల గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యి ంది. అహార ద్రవ్యోల్బణం, ఇంధనం ధరలు ఎగిసిప డుతున్నాయి. వరుస గా తొమ్మిది మాసాలుగా ఆరు శాతం ఎగువన చోటు చేసుకుంటుంది.