Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ:దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన నెల రోజుల్లోనే 10 లక్షల 5జి కనెక్షన్లు జారీ చేసినట్టు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. హైదరా బాద్, ఢిల్లీ, ముంబయి, చెన్నరు, బెంగళూరు, సిలిగురి, నాగ్పూర్, వార ణాశి నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని ఆ సంస్థ గుర్తు చేసింది. చాలా మొబైల్ పరికరాల్లో తమ 5జీ నెట్వర్క్ అందుబాటు లో కి వచ్చిందని పేర్కొంది. తమ వినియోగదారులు సిమ్ మార్చకుండానే ఇప్పుడున్న ప్లాన్లతోనే హైస్పీడ్ 5జీ సేవలను పొందవచ్చని తెలిపింది.