Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి కీలక వడ్డీ రేట్లను పెంచింది. ద్రవ్యోల్బణ కట్టడిలో భాగంగా వరుసగా నాలుగోసారి 0.75 శాతం వడ్డీ రేటు పెంచుతూ బుధవారం సమీక్షాలో నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు అమెరికాలో 3 నుంచి 3.25 శాతం మధ్య ఉన్న కనీస వడ్డీ రేటు 3.75 నుంచి 4 శాతానికి చేరింది. 2008 జనవరి తర్వాత అమెరికాలో వడ్డీరేట్లు ఇంత గరిష్ఠ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. భవిష్యత్తు రోజుల్లో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని అమెరికా ఫెడరల్ చీఫ్ జెరోం పోవెల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై 2022 డిసెంబర్ నుంచి మార్చి లోపు ఈ స్థాయిలో వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చన్నారు. 2022 జూన్ నుంచి ఇప్పటివరకూ నాలుగు దఫాలుగా 0.75 శాతం చొప్పున రేట్లను పెంచింది. వచ్చే డిసెంబర్ సమీక్షలో మరో 0.50 శాతం, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి సమీక్షల్లో 0.25 శాతం చొప్పున పెంపు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే వడ్డీ రేట్ల స్థాయి 5 శాతానికి చేరనుంది.