Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మల్టీప్లేయర్ క్రికెట్ గేమింగ్ యాప్ అయినా హిట్ వికెట్ 30 లక్షల డాలర్లు (దాదాపు రూ.25 కోట్లు) సమీకరించినట్టు ప్రక టించింది. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా క్రికెట్ అభిమానులకు ఈ క్రీడా అనుభవాన్ని అందించడానికి ఈ నిధులు సమీకరించినట్లు తెలిపింది. మల్టీప్లేయర్ యాక్సెస్ ఉండే మరిన్ని ఫీచర్లను జోడించడానికి ఈ నిధులను ఉపయోగించనున్నట్లు హిట్‌వికెట్ వ్యవస్థాపకులు కీర్తిసింగ్, కశ్యప్ రెడ్డి తెలిపారు. తమ సంస్థ 10 దేశాల్లో 30 లక్షలకు పైగా గేమర్లను కలిగి ఉందన్నారు. తెలంగాణలో ఒక శక్తివంతమైన గేమింగ్ ఎకోసిస్టమ్ అభివృద్థి చెందడం ఎంతో సంతోషంగా ఉందని హిట్ వికెట్‌ను ఉద్దేశించి తెలంగాణ ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు.